మొక్కలేసుడే.. | haritha haram starts in district | Sakshi
Sakshi News home page

మొక్కలేసుడే..

Published Sat, Jul 9 2016 4:02 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM

మొక్కలేసుడే..

మొక్కలేసుడే..

‘హరితహారం’లో ఊరూరా మొక్కల పండగ
విరివిగా నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు
కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల,
పీఆర్ కమిషనర్ అనితారామచంద్రన్

సాక్షిప్రతినిధి, ఖమ్మం : హరితహారం కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా శుక్రవారం యజ్ఞంలా చేపట్టారు. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలు, వీధుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది విరివిగా మొక్కలు నాటారు. కలెక్టరేట్‌లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,  ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ అనితారామచంద్రన్, కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసీం పాల్గొని.. మొక్కలు నాటారు. జిల్లా పరిషత్‌లో పీఆర్ కమిషన ర్ అనితారామచంద్రన్‌తో కలిసి జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత మొక్కలు నాటారు.

భక్తరామదాసు కళాక్షేత్రంలో చైర్‌పర్సన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు 250 మొక్కలు నాటారు. నగర పాలక సంస్థ కార్యాలయ ఆవరణలోని గార్డెన్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మేయర్ పాపాలాల్, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 2,36,342 మొక్కలు నాటారు.

 పాలేరు నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అధికారులు మొక్కలు నాటారు. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడులోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని.. మొక్కలు నాటారు. గోళ్లపాడులో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితారామచంద్రన్ మొక్కలు నాటారు. నేలకొండపల్లిలో హరితహారంలో మంత్రి తుమ్మల రోడ్ల వెంబడి మొక్కలు నాటారు. కూసుమంచి మండలం కిష్టాపురంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితారామచంద్రన్ హరితహారంలో పాల్గొని.. మొక్కలు నాటారు. తిరుమలాయపాలెంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అధికారులు విరివిగా మొక్కలు నాటారు.

 కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఎంవీ.రవీంద్రనాథ్ మొక్కలు నాటారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో న్యూగొల్లగూడెం వద్ద డీఎస్పీ సురేందర్‌రావు, త్రీటౌన్ సీఐ రాజగోపాల్ మొక్కలు నాటారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీనివాస్, డీఎఫ్‌ఓ కార్యాలయంలో డీఎఫ్‌ఓ శర్వానంద్, రామవరం రేంజి కార్యాలయంలో రేంజర్ జి.మధుసూదన్ మొక్కలు నాటారు. పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ జి.రాజిరెడ్డి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 కల్లూరు మండలం యర్రబోయినపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం, లింగాల గ్రామం, పోలీస్‌స్టేషన్‌లో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు. సత్తుపల్లి మార్కెట్ యార్డు, కిష్టారం పాఠశాలలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జవహర్‌నగర్‌లో నగర పంచాయతీ చైర్‌పర్సన్ దొడ్డాకుల స్వాతి, డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ భల్లా రాజేష్, గంగారం 15వ గిరిజన బెటాలియన్‌లో కమాండెంట్ కె.నాగరాజు, సబ్‌జైలులో సూపరింటెండెంట్ దేవేందర్, అటవీ శాఖ డిపోలో రేంజర్ నాగసాయి ప్రసాద్, ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో డీఈఈ థానేశ్వర్ మొక్కలు నాటారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి కాకర్లపల్లి వృద్ధాశ్రమంలో మొక్కలు నాటారు.

 భద్రాచలం ఐటీడీఏలో పీఓ రాజీవ్ గాంధీ హన్మంతు, ఎమ్మెల్యే సున్నం రాజయ్య మొక్కలు నాటారు. ఐటీడీఏలో విద్యార్థులు మానవహారం చేపట్టారు. మర్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య మార్కెట్ కార్యదర్శి నామాల శ్రీనివాసరావుతో కలిసి మొక్కలు నాటారు. డీఎఫ్‌ఓ రాంబాబు అటవీ శాఖ సిబ్బందితో కలిసి కలప డిపో ఆవరణలో మొక్కలు నాటారు. సబ్‌జైలులో జైలు సూపరింటెండెంట్ అశోక్‌కుమార్, జైలు సిబ్బంది, ఖైదీలతో కలిసి మొక్కలు నాటారు.

 బూర్గంపాడు మండలంలో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయం, పోలీస్‌స్టేషన్, సొసైటీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.

 మధిర మండలం వంగవీడులో వైరా డీఎస్పీ భూక్యా రాంరెడ్డి, సబ్‌జైలులో జడ్జి రాజేష్, నగర పంచాయితీ పరిధిలోని 15వ వార్డులో చైర్‌పర్సన్ మొండితోక నాగరాణి, చింతకాని మండలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జాయింట్ కలెక్టర్ దివ్య మొక్కలు నాటారు.

 ఇల్లెందు పోలీస్‌స్టేషన్‌లో గురుకులం విద్యార్థినులు, పోలీసులు, డీఎస్పీ ఆర్.వీరేశ్వరరావు, సీఐ నరేందర్, ఎస్సై సతీష్, కొమురెల్లి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు.

తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ప్రకాశ్, ఆర్‌ఐ కృష్ణమూర్తి, వీఆర్వోలు, సిబ్బంది, అటవీ శాఖ డిపో, అటవీ శాఖ కార్యాలయంలో డీఎఫ్‌ఓ శాంతారాం మొక్కలు నాటారు.

వైరా డీఎస్పీ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కారేపల్లి బస్టాండ్ సెంటర్‌లో మానవహారం చేపట్టి.. మొక్కలు నాటుతామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఇల్లెందు డీఎస్పీ వీరేశ్వర్‌రావు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి
హరితహారంలో మంత్రి తుమ్మల

ఖమ్మం జెడ్పీసెంటర్: ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మంత్రి కలెక్టరేట్‌లో మొక్కలు నాటి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలను నాటే బృహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. 15 రోజుల పాటు నిర్వహించనున్న హరితహారం కార్యక్రమంలో జిల్లాలో 3.50 కోట్ల మొక్కలు నాటేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.  హైదరాబాద్ నుంచి కోదాడ వరకు జాతీయ రహదారి పక్కన ఒకే రోజు ఒక గంటలో 1.50 లక్షల మొక్కలు నాటుతున్నట్లు మంత్రి చెప్పారు.

వేసిన ప్రతి  మొక్కను సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. రైతుల అభీష్టం మేరకు వారికి కావాల్సిన మొక్కలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఇంటి పరిసరాల్లో వేసుకునేందుకు అవసరమైన మొక్కలు అందించే అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. పండ్ల మొక్కలను సైతం అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, పీఆర్ కమిషనర్ అనితరామచంద్రన్, కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసీం, జేసీ దివ్య,ఏజేసీ శివ శ్రీనివాస్ డీఆర్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement