జగన్ దీక్షపై సర్కారు తీరు జుగుప్సాకరం: హర్షకుమార్
రాజమండ్రి సిటీ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాష్ట్రం కోసం, ప్రజల కోసం నిస్వార్థంగా చేసు ్తన్న నిరవధిక నిరాహార దీక్ష పట్ల మంత్రుల ప్రకటనలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉన్నాయని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. జగన్ దీక్షపై బురద చల్లే ప్రయత్నాన్ని టీవీ చానల్స్‌లో చూశాక తట్టుకోలేకపోయానన్నారు. దీక్ష కు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా రాజ మండ్రి కోటగుమ్మం సెంటర్‌లో జరుగుతున్న రిలే దీక్షలకు హర్షకుమార్ సోమవారం సంఘీభావం ప్రకటించారు. రాష్ర్ట ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు.