పాల్వంచ: పర్యాటకులపై తేనెటీగలు దాడిచేసిన ఘటన కిన్నెరసాని ప్రాజెక్టు వద్ద శనివారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పర్యాటక కేంద్రమైన కిన్నెరసానికి వరంగల్ జిల్లా హన్మకొండలోని బందావనం కాలనీకి చెందిన 44 మంది బస్సులో కిన్నెరసానికి వచ్చారు. అక్కడి ప్రకృతి అందాలను తిలకిస్తూ ప్రాజెక్టు బ్రిడ్జి మీద నుంచి తిరిగి వస్తుండగా బ్రిడ్జికింద ఉన్న తేనెటీగల గుంపు ఒక్కసారిగా వారిపై దాడిచేసింది. పర్యాటకులు వాటి బారి నుంచి రక్షించుకునేందుకు పరుగులు తీసినా వదలకుండా కుట్టాయి.
ఇందులో పది మంది పరిస్థితి తీవ్రంగా ఉండగా, మరో 12 మంది స్వల్పంగా గాయపడ్డారు. పర్యాటకులైన టి సాంబయ్య, ఎస్ రాంమూర్తి, పి మల్లయ్య, జి కవిత, ఎన్ రామకష్ణ, ఎన్ లక్ష్మీ, ఎన్ సహస్ర, చక్రధర్ స్వామి, సాంబలక్ష్మి, రామలక్ష్మిలను తీవ్రంగా కుట్టాయి. డాక్టర్ రమాదేవి, శ్రీనివాసరెడ్డి, తేజస్వీ, అనిల్ కుమార్, శ్రీనివాసరెడ్డి, రోహిత్, రమ, గడ్డం కవిత, తదితరులపై దాడిచేశాయి. బాధితులను ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పర్యాటకులపై తేనెటీగల దాడి
Published Sat, Oct 17 2015 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM
Advertisement