సిద్ధాంత నిబద్ధత ఉన్న నేత రామారావు | inaguration programme of sikkim ex governor ramarao life story book | Sakshi
Sakshi News home page

సిద్ధాంత నిబద్ధత ఉన్న నేత రామారావు

Published Sat, Jul 23 2016 9:09 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

సిద్ధాంత నిబద్ధత ఉన్న నేత రామారావు

సిద్ధాంత నిబద్ధత ఉన్న నేత రామారావు

  • మంత్రి మాణిక్యాలరావు
  • పొదిలి: పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి వి.రామారావు అని రాష్ట్ర, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. స్థానిక వాసవీ కల్యాణ్‌సదన్‌లో శనివారం సిక్కిం మాజీ గవర్నర్‌ వి.రామారావు జీవితచరిత్ర పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసంఘ్‌ నుంచి బీజేపీ వరకు ఆయన పార్టీకి చేసిన సేవలను కొనియాడారు.  
    వెలిగొండ సత్వరమే పూర్తి చేయాలి–దారా సాంబయ్య
    వెలిగొండ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయటం ద్వారానే జిల్లాకు మేలు జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య అన్నారు. గోపాల్‌ ఠాగూర్‌ స్మారక ఉపన్యాసంలో భాగంగా జిల్లా అభివృద్ధి–సమస్యలు–పరిష్కార మార్గాలు అనే అంశంపై సాంబయ్య మాట్లాడారు. స్మారక కమిటీ సభ్యుడు మువ్వల వెంకట సుబ్బయ్య అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించారు. సాంబయ్య మాట్లాడుతు జిల్లా విశిష్టతను సమస్యలు వివరించారు. ముందుగా రామారావు జీవిత చరిత్ర పుస్తకాన్ని మంత్రి మాణిక్యాలరావు  ఆవిష్కరించారు. కార్యక్రమంలో పుస్తక రచయిత శ్యాంప్రసాద్, బీజేపీ నాయకుడు బత్తిన నరసింహారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి.కృష్ణారెడ్డి, సరస్వతి శిశుమందిర్‌ అధ్యక్షుడు గునుపూడి మధూసూదనరావు, డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ జిసి సుబ్బారావు, బీజేపీ నాయకులు మాగులూరి రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement