BOOK INAGURATION
-
చుక్కాని పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం రూపొందించిన, అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పనితీరుపై రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రచించిన, ప్రచురించిన ‘చుక్కాని’(సంక్షేమానికి పునర్నిర్వచనం కేసీఆర్) పుస్తకాన్ని సీఎం కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఒక విధానం అయితే, వాటి అమల్లో ఉన్న ప్రభుత్వ లక్ష్యాలను, ఆశయాలను సాధికారికంగా చెప్పడం ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా సీఎం అభిప్రాయపడ్డారు. ఇలాంటి రచనలు మరిన్ని రావాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ పథకాలు, పనితీరు, పథకాల రూపకల్పనలో ఉన్న తాత్విక చింతనను వకుళావరణం విశ్లేషించిన తీరు బాగుందని కొనియాడారు. కేవలం రాష్ట్ర పథకాల గురించి మాత్రమే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను కూడా బేరీజు వేస్తూ తులనాత్మకంగా వెలువరించిన విషయాలు సముచితంగా ఉన్నాయని వకుళాభరణంను సీఎం అభినందించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు పాల్గొన్నారు. -
సిద్ధాంత నిబద్ధత ఉన్న నేత రామారావు
మంత్రి మాణిక్యాలరావు పొదిలి: పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి వి.రామారావు అని రాష్ట్ర, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. స్థానిక వాసవీ కల్యాణ్‌సదన్‌లో శనివారం సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు జీవితచరిత్ర పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసంఘ్ నుంచి బీజేపీ వరకు ఆయన పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. వెలిగొండ సత్వరమే పూర్తి చేయాలి–దారా సాంబయ్య వెలిగొండ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయటం ద్వారానే జిల్లాకు మేలు జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య అన్నారు. గోపాల్ ఠాగూర్ స్మారక ఉపన్యాసంలో భాగంగా జిల్లా అభివృద్ధి–సమస్యలు–పరిష్కార మార్గాలు అనే అంశంపై సాంబయ్య మాట్లాడారు. స్మారక కమిటీ సభ్యుడు మువ్వల వెంకట సుబ్బయ్య అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించారు. సాంబయ్య మాట్లాడుతు జిల్లా విశిష్టతను సమస్యలు వివరించారు. ముందుగా రామారావు జీవిత చరిత్ర పుస్తకాన్ని మంత్రి మాణిక్యాలరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పుస్తక రచయిత శ్యాంప్రసాద్, బీజేపీ నాయకుడు బత్తిన నరసింహారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి.కృష్ణారెడ్డి, సరస్వతి శిశుమందిర్ అధ్యక్షుడు గునుపూడి మధూసూదనరావు, డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ జిసి సుబ్బారావు, బీజేపీ నాయకులు మాగులూరి రామయ్య తదితరులు పాల్గొన్నారు.