
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం రూపొందించిన, అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పనితీరుపై రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రచించిన, ప్రచురించిన ‘చుక్కాని’(సంక్షేమానికి పునర్నిర్వచనం కేసీఆర్) పుస్తకాన్ని సీఎం కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు. చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఒక విధానం అయితే, వాటి అమల్లో ఉన్న ప్రభుత్వ లక్ష్యాలను, ఆశయాలను సాధికారికంగా చెప్పడం ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా సీఎం అభిప్రాయపడ్డారు. ఇలాంటి రచనలు మరిన్ని రావాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ పథకాలు, పనితీరు, పథకాల రూపకల్పనలో ఉన్న తాత్విక చింతనను వకుళావరణం విశ్లేషించిన తీరు బాగుందని కొనియాడారు. కేవలం రాష్ట్ర పథకాల గురించి మాత్రమే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను కూడా బేరీజు వేస్తూ తులనాత్మకంగా వెలువరించిన విషయాలు సముచితంగా ఉన్నాయని వకుళాభరణంను సీఎం అభినందించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment