సెప్టెంబర్ 15నుంచి జిల్లా స్థాయి ఇన్‌స్పైర్
Published Tue, Aug 23 2016 12:39 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
విద్యారణ్యపురి : జిల్లాస్థాయి ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్లను సెప్టెంబర్ 15 నుంచి నిర్వహించబోతున్నారు. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ఆదేశాల ప్రకారం వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల విద్యార్థులకు ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ సోమవారం తెలిపారు. ఈ విద్యాసంవత్సరం వరంగల్ జిల్లాలో 564మంది విద్యార్థులకు ఇన్‌సె్పౖర్ అవార్డులు రాగా, ఖమ్మం జిల్లాలో 130మంది, నల్లగొండ జిల్లాలో 30 మందికి అవార్డులు వచ్చాయి.
ఈ మేరకు మూడు జిల్లాల విద్యార్థులను రెండు గా విభజించి వరంగల్‌లోనే ఎగ్జిబిషన్లు ఏర్పాటుచేస్తున్నట్లు తెలి పారు. సెప్టెంబర్ 15, 16, 17వ తేదీల్లో మహబూబాబాద్ డివిజ న్, ఖమ్మం జిల్లా విద్యార్థులకు కలిపి మహబూబాబాద్ డివిజన్ కేంద్రంలో మొదటి ఇ¯Œæస్పైర్ ఎగ్జిబిషన్, సెప్టెంబర్ 19, 20, 21వ తేదీల్లో వరంగల్, జనగామ, ములుగు డివిజన్లు, నల్లగొండ జిల్లా విద్యార్థులకు కలిపి వరంగల్‌లో రెండో ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని డీఈఓ తెలిపారు. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్రస్థాయి ఎగ్జిబిషన్‌కు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్, స్వస్త్ భారత్, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంశాలతో పాటు ఇతర ప్రాజెక్టుల నమూనాలు ప్రదర్శించాల్సి ఉంటుం దని డీఈఓ తెలిపారు.
Advertisement