
రచయిత్రుల ముఖాముఖిలో మాట్లాడుతున్న రచయిత్రి డాక్టర్ కె.రామలక్ష్మీ ఆరుద్ర
మలక్‌పేట : లేఖిని మహిళా చైతన్య సాహితి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రచయితలతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. అక్బర్‌బాగ్ డివిజన్ పరిధిలోని శ్రీసాయి అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ ఈ కార్యక్రమానికి కళారత్న అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత్రి డాక్టర్ కె. రామలక్ష్మీ ఆరుద్ర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాహిత్య, వ్యక్తిత్వ విలువలు, జీవిత అనుభవాలను నేటి రచయిత్రులతో పంచుకున్నారు.
తాను సబ్ ఎడిటర్‌గా పనిచేసిన సమయంలో జర్నలిజం విలువలను వివరించారు. రచనలు సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలపై మాట్లాడారు. సంస్థ అధ్యక్షురాలు వాస ప్రభావతి అధ్యక్షతన జరిగిన ముఖాముఖిలో శీల సుభద్ర, విహారి, సుధమా, శీల వీర్రాజు, కే.బీ. లక్ష్మీ, హైమావతి భీమన్న, తిమిరిష జానకి, పోలప్రగడ రాజ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.