సాహితీకారులకు ప్రోత్సాహం ముఖ్యం | It is important to promote writers | Sakshi
Sakshi News home page

సాహితీకారులకు ప్రోత్సాహం ముఖ్యం

Published Sat, Oct 8 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

సాహితీకారులకు ప్రోత్సాహం ముఖ్యం

సాహితీకారులకు ప్రోత్సాహం ముఖ్యం

కడప కల్చరల్‌:
సాహితీకారులను ప్రోత్సహిస్తే వారి కలాలు మరింత పదునెక్కి ప్రజల పక్షంగా, సమాజాభివృద్ధి పక్షంగా నిలుస్తాయని కవిత విద్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు అలపర్తి పిచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. లలిత కళానికేతన్‌ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో వైవీయూ లలిత కళల విభాగం అధిపతి డాక్టర్‌ మూల మల్లికార్జునరెడ్డి శనివారం స్థానిక సీపీ బ్రౌన్‌ గ్రంథాలయంలో సాహితీకారుల అభినందన సభ నిర్వహించారు. ఇటీవల నందలూరులో ఎస్‌.దస్తగిరి సాహెబ్‌ స్మారక సాహిత్య పురస్కారాలు పొందిన కథా రచయిత పాలగిరి విశ్వప్రసాద్‌రెడ్డి, సాహితీవేత్త డాక్టర్‌ తవ్వా వెంకటయ్య, కొండూరు పిచ్చమ్మ నారాయణరాజు స్మారక సంస్థ అధ్యక్షులు కొండూరు జనార్దన్‌రాజులను అభినందించారు. ఇంకా జానమద్ది విజయభాస్కర్, గంగనపల్లి వెంకట రమణ, భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, శివారెడ్డి, యల్లేశ్వరరావు, శివారెడ్డి మాట్లాడారు. సత్కార గ్రహీతలు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement