తోట చంద్రశేఖర్ గృహప్రవేశ వేడుకలో...
సాక్షి, సిటీబ్యూరో: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నందగిరి హిల్స్‌లో జరిగిన పార్టీ నేత తోట చంద్రశేఖర్, అనురాధ దంపతుల నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్నారు. ఆయన వెంట పార్టీ ముఖ్యనేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, ఎంపీ విజయసాయి రెడ్డి తదితరులు ఉన్నారు.