వలిగొండకు వచ్చిన జగన్
వలిగొండకు వచ్చిన జగన్
Published Tue, Aug 23 2016 12:00 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM
వలిగొండ/చౌటుప్పల్/నకిరేకల్/చిట్యాల: సోమవారం వలిగొండ మండలం మాందాపురంనకు వచ్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్. జగన్మోహన్‌రెడ్డికి ప్రజలు, నాయకులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్న వలిగొండ మండలం మాందాపురంనకు చెందిన గూడూరు అశోక్‌రెడ్డి తల్లి యశోధాదేవి(78) ఆదివారం మృతిచెందడంతో సోమవారం అశోక్‌రెడ్డిని జగన్ పరామర్శించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం జగన్ రోడ్డు మార్గాన మాందాపురంనకు చేరుకున్నారు. ఈ సందర్భంగా యశోధాదేవి మృతికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. అనంతరం అశోక్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఇరుగుదిండ్ల సునీల్‌కుమార్, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మతిన్, రాష్ట్ర నాయకుడు పడాల శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవన్‌గౌడ్, కార్యదర్శి మొలుగు రాములు, మండల అధ్యక్షుడు ఇంజమూరి కిషన్, కన్నె కొండల్‌రావు, నాయకులు గూడూరు యాదిరెడ్డి, పైళ్ల నర్సిరెడ్డి, బందారపు లింగస్వామి ఉన్నారు.
అడుగడుగునా ఘన స్వాగతం
ఖమ్మం జిల్లా నుంచి వలిగొండ మండలానికి వచ్చిన జగన్‌కు జిల్లాలోని మోతె, చివ్వెంల, సూర్యాపేట, కేతేపల్లి, నకిరేకల్, నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేటల వద్ద ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజలు, మహిళలు ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. నకిరేకల్‌లో దేవీ పెట్రోల్ బంక్ వద్ద జగన్‌కు అభిమాలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆటోలో అటు వైపుగా వెళ్తుండగా జగన్ చూసిన ప్రజలు, మహిళలు అక్కడికి వచ్చి జగన్‌తో కరచాలనే చేశారు. చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడి ఆప్యాయంగా పలకరించారు. చిట్యాలలో ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇరుగు సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్‌తో సెల్ఫీ దిగేందుకు యువకులు పోటీ పడ్డారు. జగన్‌కు స్వాగతం పలికిన వారిలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జె. మహేందర్‌రెడ్డి, మైనారిటి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మతిన్, ఆ పార్టీ జిల్లా కార్యదర్శిలు కొమిరెళ్లి మోహన్‌రెడ్డి, దేవసరి పాపయ్య, చిట్యాల, రామన్నపేట, నార్కట్‌పల్లి మండల అధ్యక్షులు అంశల సత్యనారాయణ, రుద్రారపు శంకరయ్య, బాసోని నర్సింహా, నాయకులు నాతి మల్లేష్‌గౌడ్, ఎండీ ఫయాజ్, కర్ల సుందర్‌బాబు, మేడి యాదయ్య. ఎండీ సలీం, గిరి, మరియదాసు ఉన్నారు.
Advertisement
Advertisement