♦ నావాటాగా రూ.15 లక్షలు
♦ శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్
♦ ఘనంగా జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు
సంగారెడ్డి జోన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బాబూ జగ్జీవన్‌రామ్ భవన్ నిర్మాణానికి తనవంతుగా రూ.15 లక్షలు కేటాయిస్తున్నట్టు శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ ప్రకటించారు. అధికారులు వెంటనే స్థలాన్ని ఎంపిక చేయాలని సూచించారు. మంగళవారం సంగారెడ్డిలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను నిర్వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు మండలి చైర్మన్ స్వామిగౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... బడీడు పిల్లలు బడిలో ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వం భూ పంపిణీ పథకాన్ని నిరంతర ప్రక్రియగా అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం అందించే ఉచిత శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలన్నారు.
సంక్షేమ ఫలాలు అందరికి అందాలి.
సంక్షేమ ఫలాలు ప్రతిఒక్కరికి అందాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. రాజ్యంగం కల్పించే హక్కులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి చదువే ఆయుధమన్నారు.
దేశం గర్వించదగ్గ నేత...
జగ్జీవన్‌రామ్ దేశం గర్వించదగ మహానీయుడని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కొనియాడారు. కరువు పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసి రైతులకు అండగా నిలిచారన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ వివిధ సంఘాల కృషి ఫలితంగా సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇన్‌చార్జి జేసీ, జెడ్పీ సీఈఓ వర్షిణి మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులతో అభివృద్ధి సాధించాలన్నారు. ఏజేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలు, అంధులు, వృద్ధులకు సేవ చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు వస్తుందన్నారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని సామాజిక అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండి ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతోపాటు రూ.5 వేల చొప్పున నగదు పారితోషికాన్ని మండలి చైర్మన్ అందించారు. స్వయం ఉపాధి కింద మంజూరైన రుణాలను ఇద్దరికి అందజేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాలు, బడుగుబలహీన సంఘాల నాయకులు విజయ్‌కుమార్, విజయ్‌రావు, అడివయ్య, ప్రకాశ్, రాజు, అనంతయ్య, దర్శన్, నాగయ్య, రాంచంద్రనాయక్ తదితరులు ప్రసంగించారు.
మహానేతకు నివాళి..
జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు నివాళులర్పించారు. మండలి చైర్మన్‌తోపాటు ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాక ర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఇన్‌చార్జి జేసీ, జెడ్పీ సీఈఓ వర్షిణి, ఏజేసీ వెంకటేశ్వర్లు, డీఆర్‌ఓ దయానంద్, సాంఘీక సంక్షేమ శాఖ ఉపసంచాకులు శ్రీనివాసరెడ్డి, చరణ్‌దాస్, ఐకేపీ పీడీ సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, ము న్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, దళిత సంఘా ల నాయకులు, వివిధ రాజకీయ నాయకులు ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అంతకుముందు ఐబీ నుంచి కొత్తబస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది.