కూచిపూడిని ఆదరించడం సంతోషం: జస్టిస్ ఎన్వీ రమణ | justice nv ramana feel happy about international kuchipudi nrutyotsav | Sakshi
Sakshi News home page

కూచిపూడిని ఆదరించడం సంతోషం: జస్టిస్ ఎన్వీ రమణ

Published Fri, Dec 23 2016 11:57 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

కూచిపూడిని ఆదరించడం సంతోషం: జస్టిస్ ఎన్వీ రమణ

కూచిపూడిని ఆదరించడం సంతోషం: జస్టిస్ ఎన్వీ రమణ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కూచిపూడి నాట్యాన్ని ఆదరించడం చాలా సంతోషకరమని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ అంతర్జాతీయ నృత్యోత్సవాలు విజయవాడలోని ఇందిరాగాంధీ స్డేడియంలో శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో అంతర్జాతీయ తెలుగు కేంద్రాన్ని నిర్మించాలని కోరుతున్నామన్నారు. తెలుగు భాషను కూడా పరిరక్షించుకోవాలని జస్టిస్ రమణ పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. దేశ విదేశాల నుంచి వేలాదిమంది కళాకారులు ఈ ఉత్సవాలలో పాల్గొని ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement