భక్తిశ్రద్ధలతో జ్యోతుల ఉత్సవాలు
మడకశిర రూరల్: మండలంలోని భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి, కంబాల నరసింహస్వామి వార్లకు శ్రావణ శనివారం సందర్భంగా జిల్లేడుగుంట గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో జ్యోతుల ఉత్సవాలు నిర్వహించారు. గ్రామం నుంచి మహిళలు జ్యోతులతో ఊరేగింపుగా ఆలయాలు చేరుకుని ప్రదక్షిణల అనంతరం స్వామివార్లకు సమర్పించారు. అనంతరం వర్షం కురవాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు భక్తులకు తీర్థప్రర్థాద వినియోగం చేశారు.
మెళవాయిలో అన్నదాన కార్యక్రమం
మండలంలోని మెళవాయి గ్రామంలో వెలిసిన రంగనాథస్వామి ఆలయంలో శ్రావణ శనివారం సందర్భంగా వర్షం కోసం సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు వరుణదేవుడు కరుణించాలని వేడుకుంటూ ప్రసాదాన్ని స్వీకరించారు.