laxminarasimha swamy
-
యాదాద్రిలో సీఎం కేసీఆర్.. ఏరియల్ సర్వే
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం యాదాద్రిలో పర్యటిస్తున్నారు. లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పరిసరాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి.. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కేసీఆర్ యాదాద్రిని సందర్శించటం ఇదే తొలిసారి. 14 నెలల తరువాత ఆయన యాదాద్రి వచ్చారు. యాదాద్రిలో ప్రధానాలయ నిర్మాణపనులు చురుగ్గా సాగుతున్నాయి. ముఖమండపం ఇప్పటికే సిద్ధమయింది. ఇంకా మిగిలిన ప్రధానాలయం నిర్మాణపనులపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. గుట్టపై మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలను కేసీఆర్ సమీక్షిస్తారు. ఆలయానికి అనుబంధంగా ఉండే క్యూకాంప్లెక్స్లు, వసతి గృహాల నిర్మాణాలు, మంచినీటి సరఫరా, సుందరీకరణ తదితర పనులపై అధికారులకు సూచనలు చేయనున్నారు. -
యాదాద్రి గర్భాలయం ప్రారంభ తేదీలు ఖరారు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నూతన గర్భాలయాన్ని మార్చి 3 లేదా 13 తేదీల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్‌స్వామి తేదీలను ఖరారు చేసినట్లు స్తపతి సుందరరాజన్ తెలిపారు. ఆలయ ప్రారంభ తేదీ ఖరారు కావడంతో నిర్మాణ పనుల్లో అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే సప్త రాజగోపురాలతో పాటు ధ్వజస్తంభ పీఠం, బలిహరణ పీఠం దాదాపు పూర్తయ్యాయి. గర్భాలయంలో ఫ్లోరింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జనవరి 15లోపు గర్భాలయం పూర్తిస్థాయిలో నిర్మితం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆలయ మాడవీధులు, రాజగోపురాల మధ్య లో అతికించేందుకు శిల్పాలు త్వరలో రానున్నాయి. జనవరిలో రానున్న సీఎం కేసీఆర్... పనులు జరుగుతున్న తీరును పరిశీలించేందుకు జనవరి మొదటి వారంలో సీఎం కేసీఆర్ యాదాద్రికి రానున్నట్లు సమాచారం. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నందున కోడ్ అమల్లోకి రాకముందే సీఎం పర్యటన ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గర్భాలయ ప్రారంభానికి మార్చిలో తేదీలను ఖరారు చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ యాదాద్రి పనులను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం చిన జీయర్‌స్వామి ఖరారు చేసిన తేదీలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈసారి సీఎం కేసీఆర్ ప్రభుత్వ లాంఛనాలతో స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించే సుందరఘట్టం నూతన గర్భాలయంలోనే జరగనుంది. ముగిసిన అధ్యయనోత్సవాలు.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆరు రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరిరోజు స్వామివారిని ముస్తాబు చేసిన శ్రీలక్ష్మీనరసింహుడి అలంకరణతో అధ్యయనోత్సవాలు ముగిశాయి. సుమారు 25 వేల మంది భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానికి ఐదు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో జ్యోతుల ఉత్సవాలు
మడకశిర రూరల్: మండలంలోని భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి, కంబాల నరసింహస్వామి వార్లకు శ్రావణ శనివారం సందర్భంగా జిల్లేడుగుంట గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో జ్యోతుల ఉత్సవాలు నిర్వహించారు. గ్రామం నుంచి మహిళలు జ్యోతులతో ఊరేగింపుగా ఆలయాలు చేరుకుని ప్రదక్షిణల అనంతరం స్వామివార్లకు సమర్పించారు. అనంతరం వర్షం కురవాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు భక్తులకు తీర్థప్రర్థాద వినియోగం చేశారు. మెళవాయిలో అన్నదాన కార్యక్రమం మండలంలోని మెళవాయి గ్రామంలో వెలిసిన రంగనాథస్వామి ఆలయంలో శ్రావణ శనివారం సందర్భంగా వర్షం కోసం సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు వరుణదేవుడు కరుణించాలని వేడుకుంటూ ప్రసాదాన్ని స్వీకరించారు. -
సింహవాహనంపై శ్రీవారు
ఉరవకొండ రూరల్ : పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు మంగళవారం శ్రీవారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారికి అభిషేకం, మహామంగళ హారతి, కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీనారసింహుడు సింహ వాహనంపై కొలువుదీర్చారు. విశేష పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక పల్లకీలో స్వామి వారిని ఊరేగించారు. అలాగే నృసింహ జయంతి సందర్భంగా స్వామివారి మూల విరాట్‌కు విశేష పుష్పాలతో అలంకరించారు. ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు, ఈఓ రమేష్‌బాబు అధ్వర్యంలో స్వామి వారికి పూజలు నిర్వహించారు. -
తెలంగాణను ఎవరూ.. అడ్డుకోలేరు
ఎన్నికుట్రలు చేసినా రాష్ట్రం రావడం ఖాయం గుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా సాధిస్తాం అహంకారమే సీఎం అపజయానికి నాంది నల్లగొండ సభలో దామోదర రాజనర్సింహ నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: ఎన్నికుట్రలు చేసినా తెలంగాణను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని మరో పన్నెండు రోజుల్లో సాధించుకుంటామని రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణను అడ్డుకోవడానికి కిరణ్‌కుమార్‌రెడ్డి చేస్తున్న కుట్రలు నాయకుడి లక్షణాలు కావన్నారు. కుట్రలు.. కుతంత్రాలకు పర్యాయపదం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన ప్రదర్శిస్తున్న ఆహం, అహంకారం అపజయానికి నాంది పలుకుతాయన్నారు. నాటి నుంచి నేటి వరకు సీమాంధ్రులు తెలంగాణ ప్రజలను అన్ని రంగాలలో అణిచివేతకు గురిచేశారని చెప్పారు. అది చాలక ఇంకా దోచుకోవడానికి సమైక్యంగా ఉందామని కోరుకుంటున్నారని విమర్శించారు. నాడు తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని, ముల్కీ నిబంధనలు, పెద్ద మనుషుల ఒప్పందాలను తుంగలో తొక్కడంతో పాటు 610 జీఓను అమలు చేయలేదన్నారు. ఉద్యోగ, విద్య, వైద్య రంగాలతో పాటు సాగు, తాగునీటి వనరులను కొల్లగొట్టారని అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చించకుండా ప్రతిపక్షంతో పాటు సీమాంధ్ర నాయకులు అడ్డుకున్న తీరు రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురిచేసిందని చెప్పారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొనే శక్తి తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటప్రకారం తెలంగాణను ప్రకటించినందున నవతెలంగాణను ఏర్పాటు చేసుకుని రానున్న ఎన్నికలలో సోనియాగాంధీకి అండగా ఉందామని చెప్పారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో వెయ్యిమంది ఆత్మబలిదానాలకు సీమాంధ్రుల కుట్రలే కారణమన్నారు. కిరణ్ ముఖ్యమంత్రిగా కాకుండా మూర్ఖుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సోనియా దయతో ముఖ్యమంత్రి అయిన ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడకుండా నేడు సోనియానే ఎదిరించడం అహంకారానికి నిదర్శనమన్నారు. పార్లమెంట్ సమావేశంలో బిల్లును అమోదించుకుని 2014 ఎన్నికలలను తెలంగాణ రాష్ట్రంలోనే నిర్వహించుకుంటామని తెలిపారు. ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ సీమంధ్రులు లక్షల ఎకరాలను కొల్లగొట్టడమే కాకుండా ఉద్యోగాలను కూడా కొల్లగొట్టారని ఆరోపించారు. పదకొండు వందల విద్యార్థుల బలిదానాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ వేలాదిమంది విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని సంఘాలు చేసిన పోరాటాలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేసిన కృషి ఫలితంగా తెలంగాణ వచ్చిందన్నారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట సాధన కోసం దామోదర రాజనర్సింహతో పాటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా సమష్టిగా కృషి చేశామని తెలిపారు. అంతకుముందు తెలంగాణ అమరవీరుల స్థూపం , శ్రీకాంతాచారి విగ్రహం, పూలే విగ్రహం విగ్రహం వద్ద పుష్పగుచ్చం గుచ్చి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, మహిళాకాంగ్రెస్ అధ్యక్షురాలు ముంగి చంద్రకళ, నాయకులు గుమ్ముల మోహన్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి ,వంగూరు లక్ష్మయ్య, పనస శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సోనియాను మెప్పించి ఒప్పించి తెలంగాణను తెచ్చిన ఘనత దామోదర రాజనర్సింహకు దక్కుతుందని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సభలో ఆయన మాట్లాడు తూ తెలంగాణకోసం తన పదవిని త్యాగం చేయడంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నడిపించానన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చినందున రానున్న ఎన్నికలలో తనతో పాటు తెలంగాణ కోసం కృషి చేసిన ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు అన్ని నియోకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. మూడు నెలలు మీరు కష్టపడి గెలిపిస్తే 60 నెలలు మేము కష్టపడి జిల్లాలో మిగిలిన పనులను పూర్తి చేస్తామని చెప్పారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రులు ఎన్నికుట్రలు చేసి తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని చూసినా తెలంగాణ ఏర్పాటు కావడం ఖాయమని చెప్పారు. సీమాంధ్రులు పగటిదొంగల్లా తెలంగాణను దోచుకున్నారని విమర్శించారు.