jyothula uthsavam
-
భక్తిశ్రద్ధలతో జ్యోతుల ఉత్సవాలు
మడకశిర రూరల్: మండలంలోని భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి, కంబాల నరసింహస్వామి వార్లకు శ్రావణ శనివారం సందర్భంగా జిల్లేడుగుంట గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో జ్యోతుల ఉత్సవాలు నిర్వహించారు. గ్రామం నుంచి మహిళలు జ్యోతులతో ఊరేగింపుగా ఆలయాలు చేరుకుని ప్రదక్షిణల అనంతరం స్వామివార్లకు సమర్పించారు. అనంతరం వర్షం కురవాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు భక్తులకు తీర్థప్రర్థాద వినియోగం చేశారు. మెళవాయిలో అన్నదాన కార్యక్రమం మండలంలోని మెళవాయి గ్రామంలో వెలిసిన రంగనాథస్వామి ఆలయంలో శ్రావణ శనివారం సందర్భంగా వర్షం కోసం సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు వరుణదేవుడు కరుణించాలని వేడుకుంటూ ప్రసాదాన్ని స్వీకరించారు. -
నేత్రపర్వంగా జ్యోతుల ఉత్సవం
నారనాగేపల్లి (రొద్దం) : మండలంలోని నారనాగేపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ దేవత ముత్యాలమ్మకు నేత్రపర్వంగా జ్యోతుల ఉత్సవం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ మహిళలు పెద్ద ఎత్తున జ్యోతులను అమ్మవారికి మోసి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి సతీమణి కమలమ్మ, జిల్లా నలమూలల నుంచి పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
వైభవంగా జ్యోతుల ఉత్సవం
- పోటాపోటీగా ఎద్దుల బండ్ల ప్రదర్శన రొద్దం : మండల కేంద్రంలోని పెన్నానది ఒడ్డున వెలసిన పురాతన రుద్రపాద రొద్దకాంబదేవి 10వ జాతరోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం జ్యోతుల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. స్థానిక మహిళలు భక్తి శ్రద్ధలతో ఇంటికో జ్యోతిని తీసుకెళ్లి అంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. మొత్తం జ్యోతులన్నీ వచ్చాక ప్రదర్శనగా బయల్దేరి అమ్మవారి ఆలయానికి గుడిచుట్టూ మూడుసార్లు ప్రదక్షణలు చేశారు. అనంతరం జ్యోతులను గ్రామ దేవతకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జ్యోతులు మోస్తే కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఉండటంతో యువతులు పెద్దఎత్తున ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. జ్యోతుల అనంతరం పెద్ద ఎత్తున ఆలయం చుట్టూ ఎద్దుల బండ్ల ప్రదక్షణలను రైతులు పోటాపోటీగా చేశారు. జాతరలో అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా ఎస్ఐ మున్నీర్‌అహ్మద్ సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అశ్వర్థనారాయణ, జెడ్పీటీసీ చిన్నప్పయ్య, ఆస్పత్రి కమిటీ చైర్మన్ ఎంఎస్ నాగరాజు, ఆలయ, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. -
వైభవంగా జ్యోతులు
పుట్టపర్తి అర్బన్ : మండలంలోని పెడపల్లి పెద్దతాండాలో కొలువైన మారెమ్మ దేవతకు ఆదివారం గ్రామస్తులు జ్యోతులు మోసి బోనాలు సమర్పించారు. స్థానిక బస్టాండు సమీపంలోని మారెమ్మ ఆలయంలో మూడు రోజులుగా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజైన ఆదివారం మహిళలంతా జ్యోతులు, బోనాలతో తండాలోని వీధుల్లో ఊరేగుతూ అమ్మవారి ఆలయంలో సమర్పించారు. ఇటీవల సాయిలీలాబాయి అనే బాలికకు పూనకం వచ్చి ఆలయానికి పూర్వ వైభవం తీసుకు రావాలని, లేకుంటే తండాకు అరిష్టమని చెప్పడంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని గ్రామస్తులు తెలిపారు. చివరి రోజున జ్యోతులు బోనాలతో పాటు జంతుబలులిచ్చారు. ఈసందర్భంగా ఆలయాన్ని, మారెమ్మ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. కార్యక్రమానికి వేలాది మంది హాజరై పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీరాంనాయక్, లంబాడీ హక్కుల జిల్లా అధ్యక్షుడు మోహన్‌నాయక్, పెద్ద నాయకుడు బాపూజీనాయక్,యర్రా భాస్కర్, దేనే నాయక్, తిప్పానాయక్, అశ్వర్థనాయక్, బాబు తదితరులు పాల్గొన్నారు.