సరిపల్లిలో చెడుగుడు పోటీలు ప్రారంభం
Published Sat, Sep 3 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
నరసాపురం రూరల్ : కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల స్థాయి చెడుగుడు పోటీలు శుక్రవారం సరిపల్లిలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సర్పంచ్ కేదాసు రమా కాసుమణి యోగేంద్ర ప్రారంభించారు. తొలి రోజు పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. వైఎన్ కళాశాల, పెదగరువు టీముల మధ్య పోటీ జరగగా వైఎన్ కళాశాల టీము విజయం సాధించింది. ఈ పోటీలకు రిఫరీగా మహేష్‌నాయుడు వ్యవహరిస్తున్నారు.
Advertisement
Advertisement