
రేపు డిప్యూటీ సీఎం రాక
రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి శుక్రవారం కాగజ్‌నగర్‌కు రానున్నట్లు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు.
కాగజ్‌నగర్: రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి శుక్రవారం కాగజ్‌నగర్‌కు రానున్నట్లు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. బుధవారం ఆయన స్థాని కంగా విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 28న ఉదయం డిప్యూటీ సీఎం కాగజ్‌నగర్‌కు చేరుకొని కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముద్రించిన సుమారు 6 వేల స్పోకెన్ ఇంగ్లిష్ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేస్తారని తెలిపారు.
అలాగే నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్న ట్లు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.