
కలాం ఆశయాలను నిజం చేయాలి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క
శామీర్‌పేట్: మాజీ రాష్ర్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చూపిన దారిలో పయనించి ఆయన ఆశయాలను నిజం చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం శామీర్‌పేట్‌లోని కేఎల్లార్ డిగ్రీ కళాశాల ఆవరణలో మాజీ రాష్ర్ట పతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి బట్టి విక్రమార్కతో మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి, మధుయాస్కి హాజరయ్యారు. విగ్రహావిష్కరణ అనంతరం బట్టి మాట్లాడుతూ.. అబ్దుల్‌కలాం చూపిన మార్గంలో అందరూ పయణించాలని సూచించారు. దేశవిదేశాల్లో భారతదేశ ఖ్యాతిని చాటిన మహనీయుడు కలాం అని కొనియాడారు. అంతకుముందు పలువురు నాయకులు మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం దేశానికి చేసినసేవలను కొనియాడారు. అనంతరం కళాశాలలో విద్యార్థులు డాక్టర్ అబ్దుల్ కలాం ఆశయాలను, కలలను సంస్కృతిక కార్యక్రమాల రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్, లక్ష్మాపూర్ సర్పంచి కటికెల శ్యామల, కేశవరం ఎంపీటీసీ సభ్యుడు వీరప్ప, దేవరయాంజాల్ ఎంపీటీసీ సభ్యుడు జైపాల్‌రెడ్డి, జగన్‌గూడ ఎంపీటీసీ సభ్యుడు రవీందర్‌రెడ్డి, నాయకులు చిట్టమల్ల రాగజ్యోతి, శ్రీనివాస్, గోపాల్‌రెడ్డి, భిక్షపతి, జగన్నాథం, అశోక్, వెంకటేశ్, అరుణ్‌కుమార్, కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీకాంతచారి, నాయకులు పాల్గొన్నారు.