నిత్య కృషీవలుడు సీఎం కేసీఆర్‌ | kcr is eternal krsivaludu | Sakshi
Sakshi News home page

నిత్య కృషీవలుడు సీఎం కేసీఆర్‌

Published Mon, Aug 22 2016 12:06 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

kcr is eternal krsivaludu

సూర్యాపేట : నిరంతరం అనేక సమస్యలు పరిష్కరిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధికి బాటలు వేస్తున్న నిత్యకృషివలుడు సీఎం కేసీఆర్‌ అని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇవ్వని హామీలను సైతం తెరపైకి తెస్తూ అమలు చేస్తున్న ఘనత దేశంలో సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మహారాష్ట్ర నీటి ఒప్పందంతో సాగు, తాగునీటి సమస్య తీరనుందని చెప్పారు. రాష్ట్రంలో నిర్మించనున్న ఐదు ప్రాజెక్టులతో రాష్ట్ర రైతుల ఎదుర్కొంటున్న కరువు దూరం కానుందని పేర్కొన్నారు. ఈ నెల 23న మహారాష్ట్రలో విద్యుత్, నీటి ప్రాజెక్టుల ఒప్పంద పత్రాలపై సీఎం కేసీఆర్‌ ప్రధానమంత్రి సమక్షంలో సంతకాలు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గండూరి ప్రవళిక, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు వైవీ, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాశ్, మిర్యాలగూడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తిరునగరు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement