రాకెట్ కంట్రోలింగ్‌లో ఖమ్మం కుర్రాడు
‘ఇస్రో మాస్టర్ ’బృందంలో
ఉమామహేశ్వరరావు
ఖమ్మంఅర్బన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన జీఎస్ ఎల్‌వీ మార్క్–3డీ1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం తమకెంతో ఆనందంగా ఉందని నగరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన యువ శాస్త్రవేత్త వల్లూరు ఉ మామహేశ్వరరావు పేర్కొన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరి కో టలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం సాయంత్రం నిర్ణీత కక్ష్యలోకి వెళ్లిన రాకెట్ కంట్రోలింగ్ సిస్టమ్‌లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.
‘నేను పనిచేస్తున్న సమయంలో రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం సుమారు 17 ఏళ్లపాటు సుదీర్ఘంగా జరి గిన పరిశోధనల ఫలితమేనని’ అన్నారు. కాగా.. పీఆర్ విభాగంలో డీఈగా పనిచేస్తున్న కోటేశ్వరరావు కొడుకు ఉమామహేశ్వరరావు కొన్నేళ్లుగా ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు. 24 గంటలపాటు కంట్రోలింగ్ సిస్టమ్‌లో పనిచేసేందుకు టీంకు ఇద్దరు చొప్పున నలుగురిని నియమించగా.. వారిలో ఇతను ఒకరు.