GSLV Mark-3d
-
నిర్దేశిత కక్ష్యలోకి చేరిన జీశాట్–29
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 14న జీఎస్ఎల్వీ మార్క్3డీ2 రాకెట్ ద్వారా ప్రయోగించిన జీశాట్–29 ఉపగ్రహాన్ని శనివారం భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఉపగ్రహంలోని ల్యాం ఇంజిన్‌లో ఉన్న 1,742 కిలోల ఇంధనంలో కొంతభాగాన్ని ఈ నెల 15, 16న రెండు విడతలుగా వినియోగించి కక్ష్య దూరాన్ని పెంచారు. ఈనెల 14న షార్ కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ మార్క్3 డీ2 రాకెట్ ద్వారా రోదసీలోకి పంపిన జీశాట్–29 ఉపగ్రహాన్ని 190 కిలోమీటర్లు పెరిజీ (భూమికి దగ్గరగా) 35,975 కిలోమీటర్లు అపోజీ (భూమికి దూరంగా) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. హసన్‌లోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం (ఎంసీఎఫ్) వారు ఉపగ్రహాన్ని తమ అదుపులోకి తీసుకుని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టే ప్రక్రియను చేపట్టారు. 190 కిలోమీటర్లు పెరిజీని (భూమికి దగ్గరగా) 10,287 కిలోమీటర్ల ఎత్తుకు పెంచుతూ అపోజీని (భూమికి దూరంగా) 35,873 కిలోమీటర్లకు తగ్గించారు. ఆఖరి విడతగా 488 సెకెండ్ల పాటు ల్యాం ఇంజిన్లు మండించి భూ బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఇస్రో శాస్త్రవే త్తలు విజయవంతంగా స్థిరపరిచారు. ఈ ఉపగ్రహం సుమారు 10 ఏళ్ల పాటు సేవలను అందిస్తుంది. -
భళా.. ‘బాహుబలి’!
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇస్రో చరిత్రలోనే అత్యంత బరువైన జీఎస్ఎల్వీ మార్క్3–డీ2 రాకెట్.. కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్29ను విజయవంతంగా అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల కమ్యూనికేషన్ అవసరాలను ఈ ఉపగ్రహం తీర్చనుంది. మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన 27 గంటల కౌంట్‌డౌన్ ముగియగానే బుధవారం సాయంత్రం 5.08 గంటలకు మార్క్3–డీ2 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని ప్రయోగ కేంద్రం ఇందుకు వేదికైంది. ఉపగ్రహాన్ని వాహకనౌక విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో చేర్చిందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. లాంచ్‌ప్యాడ్ నుంచి బయల్దేరిన 16 నిమిషాల్లోనే రాకెట్ నిర్ణీత కక్ష్యను చేరుకుంది. దీంతో ప్రయోగాన్ని వీక్షిస్తున్న శాస్తవేత్తలు ఆనందోత్సాహాల్లో మునిగారు. ఒకరినొకరు అభినందించుకున్నారు. గజ తుపాను నేపథ్యంలో ఓ దశలో ప్రయోగ నిర్వహణపై ఆందోళనలు నెలకొన్నా, చివరకు వాతావరణం సహకరించడంతో శాస్త్రవేత్తలు ఊపిరిపీల్చుకున్నారు. జీఎస్ఎల్వీ మార్క్3– డీ2 రాకెట్ ప్రయోగం రెండోసారీ విజయవంతం కావడం విశేషం. 2017లో జీశాట్19ను నింగిలోకి పంపేందుకు మార్క్2–డీ1ను వాడారు. భవిష్యత్తులో చేపట్టనున్న మానవ సహిత మిషన్ ‘గగన్‌యాన్’లో ఈ రాకెట్‌నే వినియోగించనున్న నేపథ్యంలో తాజా ప్రయోగం శాస్త్రవేత్తల మనోధైర్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. మూడు దశల్లో ప్రయోగం.. ఈ ప్రయోగాన్ని మూడు దశల్లో 16.43 నిమిషాల్లో ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే రాకెట్‌కు మొదటి దశలో రెండు వైపులా అమర్చిన 200 టన్నుల ఘన ఇంధన బూస్టర్లు (ఎస్–200)ను మండించడంతో రాకెట్ ప్రయాణం ప్రారంభమైంది. అనంతరం 1.54 నిమిషాలకు రెండో దశలోని 110 టన్నుల ద్రవ ఇంధనం (ఎల్–110)ను మండించి రాకెట్ వేగాన్ని పెంచారు. తరువాత 2.19 నిమిషాలకు మొదటి దశలోని ఎస్–200 రెండు బూస్టర్లను విడదీసి మొదటి దశను విజయవంతంగా పూర్తిచేశారు. ఎల్–110 దశ 5.18 నిమిషాలకు రెండో దశను పూర్తి చేసింది. ఆ తర్వాత 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనం(సీ–25)తో మూడో దశను ప్రారంభించారు. 16.28 నిమిషాలకు క్రయోజనిక్ దశ కటాఫ్ అయిపోయింది. 16.43 నిమిషాలకు రాకెట్‌కు శిఖర భాగంలో అమర్చిన 3,423 కిలోల జీశాట్–29ను విడదీసి భూ బదిలీ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశ పెట్టారు. శాస్త్రవేత్తలకు జగన్ శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: జీఎస్ఎల్వీ మార్క్ 3–డీ2 ప్రయోగం విజయవంతం కావడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాన్ని జయప్రదం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో చేసే ప్రయోగాలు సైతం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారతీయ అంతరిక్ష కార్యక్రమాల్లో ఇదొక మైలురాయి అని జగన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయోగం.. ఎవరెస్ట్‌తో సమానంఇన్నాళ్లు చేసిన ప్రయోగాలు ఒక ఎత్తయితే ఈ ప్రయోగం మాత్రం ఎవరెస్ట్ అంత ఎత్తయినదని ఇస్రో చైర్మన్ కె.శివన్ అభివర్ణించారు. మన సమాచార ఉపగ్రహాలనే కాకుండా విదేశాలకు చెందిన భారీ ఉపగ్రహాలను కూడా పంపే స్థాయికి చేరుకోవడం గర్వకారణమని అన్నారు. తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగం ‘గగన్‌యాన్’ను డిసెంబర్ 2021 నాటికి చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన వెల్లడించారు. దానికి ముందు ప్రయోగాత్మకంగా మానవ రహిత గగన్‌యాన్‌ను డిసెంబర్ 2020 నాటికి పరీక్షించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, 2019 జనవరిలో చంద్రుడిపై పరిశో«ధనలు చేసేందుకు చంద్రయాన్–2 గ్రహాంతర ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. 2019లో 10 ప్రయోగాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని వివరించారు. అధునాతన పేలోడ్లతో.. జీశాట్–29లో ప్రత్యేకించి కేయూ–బ్యాండ్ ఫోర్ యూజర్ స్పాట్ బీమ్స్, కేఏ–బ్యాండ్ ఫోర్ యూజర్ స్పాట్ భీమ్‌తో పాటు వన్ యూజర్ స్టీరిబుల్ భీమ్, క్యూ/వీ– బ్యాండ్ కమ్యూనికేషన్ పేలోడ్, జియో హైరిజల్యూషన్ కెమెరా, ఆప్టికల్ కమ్యూనికేషన్ పేలోడ్ అనే ఐదు రకాల ఉపకరణాలను అమర్చారు. కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో ఇలాంటి పేలోడ్స్ పంపడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూ కశ్మీర్‌లోని మారుమూల గ్రామాలను ఈ ఉపగ్రహం ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తుంది. విలేజ్ రీసోర్స్ సెంటర్స్ అంటే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు, సదుపాయా లు, ఇతర ఏర్పాట్లను గుర్తించి సమాచారాన్ని అందించడమే కాకుండా భారత సైనిక అవసరాలకూ దోహదపడుతుంది. ఉపగ్రహం వివరాలు.. ► రాకెట్: జీఎస్ఎల్వీ మార్క్ 3–డీ2 ► ఉపగ్రహంతోకలిపి మొత్తం బరువు: 640 టన్నులు ► ఎత్తు: 43.39 మీటర్లు ► వ్యాసం: 4 మీటర్లు ► ప్రయోగ దశలు: మూడు (ఘన, ద్రవ, క్రయోజెనిక్) ► జీశాట్29 ఉపగ్రహం బరువు: 3,423 కిలోలు ► ఉపగ్రహ జీవితకాలం: 10 ఏళ్లు ► పనిచేయడానికి కావాల్సిన విద్యుత్: 4600 వాట్లు రాకెట్ నమూనాతో ఇస్రో చైర్మన్ శివన్ -
రేపు జీఎస్ఎల్వీ మార్క్–3డీ2 ప్రయోగం
-
జీఎస్ఎల్వీకి నేడు కౌంట్‌డౌన్
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లోని రెండో ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 5.08 గంటలకు జీఎస్ఎల్వీ మార్క్ 3డీ2 ఉపగ్రహవాహక నౌకను ప్రయోగించనున్నారు. 25.30 గంటల ముందు అంటే.. మంగళవారం సాయంత్రం 3.38 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సోమవారం ప్రయోగ సమయాన్ని ఎంఆర్ఆర్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. షార్‌లోని బ్రహ్మ ప్రకాష్ హాల్లో సోమవారం ఎంఆర్ఆర్ చైర్మన్ బీఎన్ సురేష్, కాటూరి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఆర్ఆర్ కమిటీ భేటీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాకెట్‌లోని అన్ని దశలకు తుది విడత పరీక్షలు నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆ«థరైజేషన్ బోర్డుకు అప్పగించారు. బోర్డు చైర్మన్ పాండ్యన్ ఆధ్వర్యంలో రిహార్సల్స్ నిర్వహించి కౌంట్‌డౌన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. జీఎస్ఎల్వీ మార్క్ 3డీ2 రాకెట్లో రెండో దశలోనే ద్రవ ఇంధనాన్ని నింపాల్సి ఉండడంతో కౌంట్‌డౌన్ సమయాన్ని 25:30 గంటలు గానే నిర్ణయించారు. ఇస్రో చరిత్రలో అతిపెద్ద ప్రయో గం కావడంతో శాస్త్రవేత్తలు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. మూడున్నర టన్నులపైగా బరువున్న ఉపగ్రహాన్ని షార్ నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి. మేకిన్ ఇండియాగా గుర్తింపు: 2014 డిసెంబర్ 18న జీఎఎస్‌ఎల్‌వీ మార్క్–3 ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించి విజయం సాధించారు. ఆ ప్రయోగంలో క్రయోజనిక్ దశ లేకుండా డమ్మీని పెట్టి ప్రయోగించారు. 2017 జూన్ 5న జీఎస్ఎల్వీ మార్క్ 3డీ1 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించా రు. ఇప్పుడు మూడోసారి జీఎస్ఎల్వీ మార్క్ 3డీ2 ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. మార్క్–3 లాంటి భారీ ప్రయోగాలు విజయవంతమైతే రాకెట్ టెక్నాలజీలో భారత్ ఇతర దేశాలపై ఆధారపడకుండా మేకిన్ ఇండియాగా గుర్తింపు సాధిస్తుంది. 3,700 కిలోల బరువున్న ఉపగ్రహం రోదసీలోకి.. ప్రయోగం ద్వారా 3,700 కిలోలు బరువుగల జీశాట్–29 అనే సరికొత్త కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా కేఏ, ఎక్స్, కేయూ మల్టీబీమ్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్ పేలోడ్స్‌ను పంపిస్తున్నారు. ఇలాంటి ట్రాన్స్‌ఫాండర్లు పంపడం ఇస్రో ఇదే మొదటిసారి. గ్రామీణ ప్రాంతాల్లోని వనరులు తదితరాలను గుర్తించి సమాచారాన్ని అందించడమే కాకుండా దేశ ఆర్మీకి ఆవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉపగ్రహం 12ఏళ్ల పాటు సేవలందిస్తుంది. గజ తుపాన్ ప్రభావంతో 30 కిలో మీటర్లు వేగంతో గాలులు వీస్తాయని ఇస్రో ఉపగ్రహలు సమచారం ఇచ్చినట్టుగా తెలిసింది. గాలులతో ప్రయోగానికేమీ ఇబ్బంది ఉండదని శాస్త్రవేత్తలు భావించి ప్రయోగ, కౌంట్‌డౌన్ సమయాన్ని వెల్లడించారు. ఇస్రో చైర్మన్ రాక నేడు ఇస్రో చైర్మ్న్ ఏఎస్ కిరణ్‌కుమార్ మంగళవారం సాయంత్రం షార్కు చేరుకుని కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించి సహచర శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించనున్నారు. -
రాకెట్ కంట్రోలింగ్‌లో ఖమ్మం కుర్రాడు
‘ఇస్రో మాస్టర్ ’బృందంలో ఉమామహేశ్వరరావు ఖమ్మంఅర్బన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన జీఎస్ ఎల్వీ మార్క్–3డీ1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం తమకెంతో ఆనందంగా ఉందని నగరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన యువ శాస్త్రవేత్త వల్లూరు ఉ మామహేశ్వరరావు పేర్కొన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరి కో టలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం సాయంత్రం నిర్ణీత కక్ష్యలోకి వెళ్లిన రాకెట్ కంట్రోలింగ్ సిస్టమ్‌లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ‘నేను పనిచేస్తున్న సమయంలో రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం సుమారు 17 ఏళ్లపాటు సుదీర్ఘంగా జరి గిన పరిశోధనల ఫలితమేనని’ అన్నారు. కాగా.. పీఆర్ విభాగంలో డీఈగా పనిచేస్తున్న కోటేశ్వరరావు కొడుకు ఉమామహేశ్వరరావు కొన్నేళ్లుగా ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు. 24 గంటలపాటు కంట్రోలింగ్ సిస్టమ్‌లో పనిచేసేందుకు టీంకు ఇద్దరు చొప్పున నలుగురిని నియమించగా.. వారిలో ఇతను ఒకరు.