కిడ్నాప్ కలకలం
కదిరిలో టీడీపీ నేత తనయుడి అపహరణ
ఫైనాన్షియర్ రాణాప్రతాప్‌రెడ్డి పనేనంటున్న కుటుంబ సభ్యులు
చితకబాది కోయంబత్తూరు సమీపంలో పడేసి వెళ్లిన కిడ్నాపర్లు
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్, టీడీపీ నేత సోమగుట్ట ప్రతాప్‌రెడ్డి తనయుడు ప్రేమనాథ్‌రెడ్డి బుధవారం కదిరిలో కిడ్నాప్ అయ్యాడు. ఖాకీ దుస్తుల్లో వచ్చిన వ్యక్తులు ఆయన్ను అపహరించుకుపోయారు. బాగా చితక్కొట్టి తమిళనాడు రాష్ట్రంలో పడేసి వెళ్లిపోయారు. కిడ్నాప్ వ్యవహారం పట్టణంలో కలకలం రేపింది.
కదిరిలోని ఇందిరాకాలనీలో ప్రేమనాథరెడ్డి నివాసముంటున్నాడు. ఈయన బుధవారం ఉదయం 5.30 గంటలకు వాకింగ్‌కు బయల్దేరాడు. భార్య ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఖాకీ దుస్తుల్లో నలుగురు వ్యక్తులు (ఇద్దరు హెల్మెట్, మిగిలిన ఇద్దరు మంకీ క్యాప్‌లు ధరించి) రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చారు. ‘ప్రేమనాథ్‌రెడ్డి ఉన్నాడామ్మా..?’ అని వారిలో ఒకరు ప్రశ్నించారు. ఆమె బీట్ కానిస్టేబుళ్లని భావించి ‘సార్, అదిగో అక్కడ వాకింగ్‌కు వెళుతున్నాడు’ అంటూ భర్తవైపు చేయి చూపించింది. ఆమె చూస్తుండగానే వారు వెళ్లి తుపాకీతో భయపెట్టి ప్రేమనాథ్‌రెడ్డిని బలవంతంగా ద్విచక్రవాహనంలో తీసుకెళ్లారు.
ఫైనాన్షియర్ రాణాప్రతాప్‌రెడ్డిపై అనుమానం
కడపకు చెందిన ఫైనాన్షియర్ రాణాప్రతాప్‌రెడ్డి పనేనంటూ కిడ్నాప్‌కు గురైన ప్రేమనాథరెడ్డి భార్య లక్ష్మి, అతని తండ్రి ప్రతాప్‌రెడ్డిలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘నా కొడుకు ప్రేమనాథ్‌కు కడపలో ఉన్న రాణాప్రతాప్‌రెడ్డి రూ 3 లక్షలు బాకీ ఉన్నాడు. ఆ డబ్బు ఇవ్వాలని కడపకు వెళ్లి అతన్ని గట్టిగా అడగడంతో చెక్ రాసిచ్చాడు. డబ్బు ఇవ్వాలని కోర్టు ద్వారా ఈ మధ్యే అతనికి నోటీసు పంపించాడు. దానికి అతను నా కొడుకుతో పాటు నా భార్య, నా కోడలుకు సైతం వారం రోజులుగా ఫోన్లు చేసి చంపుతామంటూ బెదిరిస్తున్నాడు. నా కొడుకును అతనే కి డ్నాప్ చేయించి ఉంటాడు’ అని ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అనంతపురం నుంచి డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆనవాళ్లు సేకరించారు.
కోయంబత్తూరులో పడేశారు..
కిడ్నాపర్లు.. ప్రేమనాథ్‌రెడ్డికి ముక్కు దగ్గర మత్తు మందు స్ప్రేచేసి తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు తీసుకెళ్లినట్లు కదిరి పోలీసులకు సమాచారం అందింది. ఇనుపరాడ్లతో కొట్టి రోడ్డుపక్కన పడేయడంతో స్థానికులు పొడనూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన పోలీస్ స్టేషన్‌లో క్షేమంగా ఉన్నారు. ఈ కిడ్నాప్ Ðð నుక రాణాప్రతాప్‌రెడ్డి ఉన్నారా? లేక ఇంకెవరి హస్తమైనా ఉందా? అనేది విచారణలో తేలుతుందని కదిరి డీఎస్పీ ఎన్.వి.రామాంజనేయులు ‘సాక్షి’కి తెలియజేశారు. ప్రేమనాథ్‌రెడ్డిని తీసుకొచ్చేందుకు ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి నేతత్వంలో ఒక బందాన్ని అక్కడికి పంపినట్లు చెప్పారు.