ప్రత్యేక హోదా కోరుతూ న్యాయవాదుల ధర్నా
నిడదవోలు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ముందు శుక్రవారం న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. న్యాయవాదుల ఐక్యత వర్థిల్లాలని నినదించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ విజయకమార్, ఎం.అర్జునుడు, యామన శ్రీనివాసరావు, ఎస్వీ సూర్యనారాయణ, దేవులపల్లి రవిశంకర్, జి.రవి, కోడి శ్రీను, ఎన్.భాస్కరరావు, కొనకళ్ల వెంకటేశ్వరరావు, పి. పోసిబాబు, పి.వీరాంజనేయ, విపర్తి ప్రభాకర్, ఎండీ మహబూబ్, కమల్‌బాబు, పి.సుబ్రహ్మణ్యం, డి.మహేష్, కె.సత్యనారాయణ, సోమరాజు పాల్గొన్నారు.