రైల్వే గేటును ఢీకొన్న లారీ
నిడదవోలు : లారీ ఢీకొట్టడంతో రైల్వే గేటు విరిగిపోవడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. శనివారం మధ్యాహ్నం నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం వెళుతున్న ఊక లారీ వేగంగా వచ్చి స్థానిక రైల్వే గేటును ఢీకొట్టింది.
నిడదవోలు : లారీ ఢీకొట్టడంతో రైల్వే గేటు విరిగిపోవడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. శనివారం మధ్యాహ్నం నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం వెళుతున్న ఊక లారీ వేగంగా వచ్చి స్థానిక రైల్వే గేటును ఢీకొట్టింది. దీంతో గేటు రెండు ముక్కలైంది. రైల్వే సిగ్నల్ వ్యవస్థ దెబ్బతినడంతో పలు రైళ్లు రెండు నిమిషాల పాటు ఆలస్యంగా నడిచాయి. పట్టణ ఎస్సై డి.భగవాన్ ప్రసాద్, రైల్వేస్టేçÙన్ మేనేజర్ ఆకుల ప్రభాకరరావు, ఆర్‌పీఎఫ్ ఎస్సై వసంతరావు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. గేటు విరగడంతో నిడదవోలు వైపు పోలీస్‌స్టేçÙన్ వరకు, మరోవైపు శెట్టిపేట వరకు వాహనాలు నిలిచిపోయాయి. రైల్వే సిగ్నల్ వ్యవస్థ తాత్కాలికంగా పనిచేయకపోవడంతో ఔటర్‌లో పలు రైళ్లను నిలిపివేసి ట్రాఫిక్ క్లియర్ అయిన తరువాత పంపించారు. రైల్వే టెక్నికల్ సిబ్బంది చేరుకుని తాత్కలిక గేటును అమర్చారు. రైల్వే టెక్నికల్ సిబ్బంది శ్రమించి సాయంత్రం 7.30 వరకు మరమ్మతు పనులు పూర్తి చేశారు. తాత్కలిక గేటు ఏర్పాటు చేసి సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరించారు. మెయిల్, లింక్, షిర్డీ, కోణార్క్, తిరుమల, శేషాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లు రైల్వే గేటు కారణంగా రెండేసి నిమిషాల పాటు ఆలస్యంగా నడిచాయి.