పశువుల లారీ పట్టివేత | Lorry seize | Sakshi
Sakshi News home page

పశువుల లారీ పట్టివేత

Published Sat, Aug 20 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

లారీలో ఉన్న పశువులు

లారీలో ఉన్న పశువులు

దత్తిరాజేరు : నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తున్న లారీని స్థానిక పోలీస్‌లు పట్టుకున్నారు. పెదమానాపురం ఎస్సై మహేష్‌ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదమానాపురంనకు చెందిన పశువుల వ్యాపారి కిల్లాడ భాస్కరరావు పశువులను లారీలో ఎక్కించి కేరళకు తరలిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దాసరిపేట వద్ద లారీని పట్టుకున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్‌ రామస్వామి, క్లీనర్‌ కట్టుముత్తు, తదితరులను అదుపులోకి తీసుకున్నారు. పశువులను విజయనగరంలోని గోశాలకు తరలిస్తామని ఎౖస్సై తెలిపారు. పశువుల యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.  
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement