పనుల్లో నాణ్యత పాటించాలి
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ సంస్థకు సంబంధించిన పనుల్లో నాణ్యత పాటించాలని ఏస్‌పీడీసీఎల్ క్వాలిటీ కంట్రోల్ (తిరుపతి) ఎస్‌ఈ వరకుమార్ సూచించారు. మంగళవారం ఆయన తన బృందంతో కలిసి కర్నూలు డివిజన్‌లో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల మేరకు పనులు చేపట్టి నిరీ్ణత గడువులోపు పూర్తి చేయాలని కోరారు. తనిఖీలు పూర్తయిన తరువాత నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తామని వెల్లడించారు. ఆయన వెంట కర్నూలు ఆపరేషన్స్ డీఈ రమేష్, టౌన్–1, 2 ఏడీఈలు టీఎన్ ప్రసాద్, జి. రంగస్వామి, కల్లూరు ఎస్టేట్ ఏఈ పెద్దయ్య ఉన్నారు.