గోరంట్ల (సోమందేపల్లి) : ఈత సరదా ఓ నిండుప్రాణాన్ని బలిగొంది. గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లికి చెందిన బాబు(29) ఈతకెళ్లి దురదృష్టవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. గ్రామ సమీపంలోని శివారెడ్డి అనే రైతుకు చెందిన వ్యవసాయ ఈత కొట్టేందుకు ఆదివారం వెళ్లిన బాబుకు మూర్ఛ రావడంతో నీట మునిగి మరణించినట్లు తల్లి ఆదెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.