
వాహనం ఢీ కొని వ్యక్తి మృతి
గాలివీడు: మండల పరిధిలోని అరవీడు ఆంజనేయస్వామి గుడి దగ్గర మంగళవారం సాయంత్రం బొలొరో వాహనం ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. అరవీడు పంచాయతీ క్రిందమాలపల్లెకు చెందిన నగిరిమడుగు సిద్దయ్య(30) గాలివీడులో కూలి పని ముగించుకొని మోటర్‌సైకిల్‌పై ఇంటికి బయలుదేరాడు. మదనపల్లె నుంచి వస్తున్న బొలొరో వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏఎస్‌ఐ రెడ్డెయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.