మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో వ్యవసాయ బావిలో శవమై తేలింది.
వివాహిత అనుమానాస్పద మృతి
Feb 21 2017 12:31 PM | Updated on Sep 28 2018 3:41 PM
మఠంపల్లి(సూర్యాపేట జిల్లా): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన మల్లెబోయిన సునీత(30) మంగళవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో వ్యవసాయ బావిలో శవమై తేలింది.
మూడు రోజుల క్రితం అదృశ్యమైన సునీత శవమై కనిపించడంతో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలికి భర్త గోపీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపీ రైతుగా జీవనం సాగిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు.
Advertisement
Advertisement