మాట్లాడుతున్న మాచర్ల భారతి
ఖమ్మం సిటీ : ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని ఐద్వా జిల్లా ఆధ్యక్షురాలు మాచర్ల భారతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వానకాలం ప్రారంభం కావడంతో ప్రజలు డెంగీ, మలేరియా,టైయిఫాడ్ లాంటి విషజ్వరాలతో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య శాలలో వారికి సరైనా సౌకర్యాలు లేకపోవడంతో వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలపారు. ఐద్వా ఆధ్వర్యంలో జిల్లా అంతట సర్వేలు నిర్వహించి పలు సమస్యలపై వైద్య అధికారులకు నివేదికలు నివేదించిన స్పందన లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వైద్యరంగానికి అధిక నిధులు కేటాయించాలని కోరారు. సమావేÔ¶ ంలో సంఘం డివిజన్ కార్యదర్శి గట్టు రమాదేవి, నాయకులు నాగమణి,అమరావతి,సరస్వతి,పద్మ పాల్గొన్నారు.