‘మిర్యాల’వాసికి బెస్ట్‌ ఆర్ట్‌ టీచర్‌ అవార్డు | Miryalguda guy got best art teacher award | Sakshi
Sakshi News home page

‘మిర్యాల’వాసికి బెస్ట్‌ ఆర్ట్‌ టీచర్‌ అవార్డు

Published Wed, Aug 24 2016 10:16 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

‘మిర్యాల’వాసికి బెస్ట్‌ ఆర్ట్‌ టీచర్‌ అవార్డు

‘మిర్యాల’వాసికి బెస్ట్‌ ఆర్ట్‌ టీచర్‌ అవార్డు

మిర్యాలగూడ టౌన్‌ : బాలబాలికల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు చిత్రలేఖనంలో విద్యార్థులకు జాతీయ, రాష్ట్ర స్థాయిలలో ఉత్తమ అవార్డులను సాధించేందుకు కృషి చేసిన మిర్యాలగూడ పట్టణానికి చెందిన చిత్రకారుడు యినుగుర్తి విజయ్‌కుమార్‌కు బెస్ట్‌ ఆర్ట్‌ టీచర్‌ అవార్డ్‌ దక్కింది. బుధవారం ప్రతాఫ్, వీణా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెయింటింగ్‌ హైదరాబాద్‌ వారు పోట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో చిత్రకారుడు విజయ్‌కుమార్‌కు ఆ నలుగురు సినిమా డైరెక్టర్‌ సి. చంద్రసిద్దార్ధ చేతుల మీదుగా బెస్ట్‌ ఆర్ట్‌ టీచర్‌ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్‌ స్టేట్‌ ఆర్ట్‌ గాలరీ డి. మనోహర్, లిమ్కాబుక్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ దార్ల నాగేశ్వర్‌రావు, ప్రముఖ చిత్రకారుడు టీవీఎస్‌బీఎస్‌ శాస్త్రీ, బాపూజీ, రమణ, సంస్థ డైరెక్టర్లు రామ్‌ ప్రతాఫ్, వీణ తదితరులున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement