miryalguda
-
అన్నిఅక్రమాలే డాక్టర్ సెల్ఫీ వీడియో
-
సాగర్ కాల్వలో కొట్టుకుపోయిన కారు.. వీడిన మిస్టరీ
సాక్షి, మిర్యాలగూడ: నాగార్జున సాగర్ ఎడమకాల్వలోకి గుర్తు తెలియని వ్యక్తులు కారును తోసేసి పరారైన ఘటనలో.. మిస్టరీ దాదాపుగా వీడింది. కారును కాలువలోకి తోసేసింది అన్నాచెల్లెళ్లుగా గుర్తించారు పోలీసులు. కుటుంబ విభేధాలతో పాటు మతిస్థిమితం సరిగా లేనందునే వాళ్లు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తిప్పర్తికి చెందిన రామాంజనేయులు రిటైర్డ్ హెచ్ఎమ్. ఆయనకు మల్లికార్జున్, విఘ్నేశ్వరీ ఇద్దరు పిల్లలు. ఇద్దరు కూడా దివ్యాంగులే. గత కొంతకాలంగా తండ్రితో వాళ్లకు విభేదాలు నడుస్తున్నాయి. తల్లిదండ్రులతో దూరంగా మిర్యాలగూడ సమీపంలోని అవంతిపురంలో ఉంటున్నారు ఆ అన్నాచెల్లెళ్లు. తమను పట్టించుకోవడం లేదంటూ కొంతకాలం క్రితం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో తండ్రి రామాంజనేయులుపై ఫిర్యాదు కూడా చేసింది విఘ్నేశ్వరీ. ఈ క్రమంలో.. హైదరాబాద్ నాగోలులో ఓ కారును కొనుగోలు చేశారు ఆ అన్నాచెల్లెళ్లు. ఆపై ఆత్మహత్య చేసుకునేందుకే వాళ్లు సాగర్ ఎడమకాల్వలోకి కారును తోసేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ నిమిత్తం మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. అయితే మిర్యాలగూడ లో పార్కింగ్ చేసిన సమయంలో తమ కారు పోయిందని విఘ్నేశ్వరీ పొంతనలేని సమాధానాలు చెప్తోంది. దీంతో తల్లిదండ్రులతో మాట్లాడి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు. వీడియో ద్వారా.. నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం శివారులో హోలీ పండుగ సందర్భంగా.. కొందరు యువకులు కాల్వలో ఈత కొడుతున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని యువకుడితోపాటు, ఓ మహిళ కారులో వచ్చారు. సాగర్ ఎడమ కాల్వ కట్టపైన వారు కారు నిలిపారు. అనంతరం కారును కాల్వలోకి తోసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సమీపంలో కాల్వలో ఈత కొడుతున్న యువకుడు సుధాకర్ అక్కడికి చేరుకుని నీటిలో కారు కొట్టుకుపోతుండగా తన సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కారు నీటిలో కొంతదూరం కొట్టుకుపోయి పూర్తిగా మునిగింది. అయితే అందులో ఎవరూ లేరని పోలీసులకు ఆ యువకుడు చెప్తున్నాడు. పోలీసులు కారు ఆచూకీ కోసం కాల్వ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. కారు వెనుక డిక్కీలో ఏమైనా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఆర్జీవీపై ప్రణయ్ తండ్రి ఫిర్యాదు..
సాక్షి, నల్గొండ: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా రూపొందిస్తున్న ‘మర్డర్’ సినిమాపై పెరుమాళ్ల ప్రణయ్ తండ్రి బాలస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కోర్టును ఆశ్రయించారు. నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాల మేరకు దర్శకుడు రాంగోపాల్ వర్మ, సినీ నిర్మాత నట్టి కరుణలపై శనివారం కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. బాలస్వామి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో మిర్యాలగూడ వన్‌టౌన్ సిఐ సదా నాగరాజు రాంగోపాల్ వర్మతో పాటు, మర్డర్ సినిమా నిర్మాత నట్టి కరుణ మీద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా అమృత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ హత్యకు గురికావడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.(ఏడుపు కూడా రావడం లేదు: అమృతా ప్రణయ్) ఈ క్రమంలో అనేక పరిణామాలు, జైలు శిక్ష అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో జూన్ 21 ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ..‘ఓ తండ్రి అమితమైన ప్రేమ.. ఓ తండ్రి తన కుమార్తె అమితంగా వల్ల కలిగే ప్రమాదం.. అమృత, మారుతిరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్స్ డే రోజున.. ఈ విషాద తండ్రి కథకు సంబంధించిన చిత్రం పోస్టర్‌ను లాంచ్ చేస్తున్నాను’ అంటూ వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వర్మ ట్విటర్లో పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై అమృత ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.(ఆర్జీవీ ‘మర్డర్’: మరో పోస్టర్ వైరల్) -
రేషన్‌కార్డు నా కొద్దు..!
మిర్యాలగూడ టౌన్ : బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తీసుకువచ్చిన తెల్ల రేషన్‌కార్డు (బీపీఎల్) నేడు బియ్యానికి తప్ప దేనికీ పనికి రాకుండా పోయిందని పట్టణానికి చెందిన వీవీఎస్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తూ శనివారం ఆర్డీఓ కార్యాలయం వద్ద డీఏఓ రఘునాథ్, నాయబ్ తహసీల్దార్ జి. రామకృష్ణారెడ్డికి కార్డును అందజేశాడు. రేషన్ కార్డు ద్వారా గతంలో బియ్యం, చింతపండు, పప్పు, కారం, పామాయిల్‌లతో పాటు పలు రకాల నిత్యావసర సరుకులు ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి ప్రభుత్వం లబ్ధిదారులకు అందించేది.. ఇటీవల బియ్యంతో పాటు పంచదార అడపదడప వస్తుంది. కాని మిగిలిన ఏ నిత్యవసర వస్తువులు కూడా రాకుండా ప్రభుత్వం కోత విధించింది. దీంతో నిరుపేదల లబ్ధిదారుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఈ కార్డు బియ్యానికి తప్ప.. మరేదానికి ఎలాంటి ఉపయోగం లేదని, తన రేషన్ కార్డును పట్టణంలోని మెయిన్ బజారుకు చెందిన వీవీఎస్ కుమార్ డీఏఓ, నాయబ్ తహసీల్దార్లకు అందించాడు. దీంతో అధికారులు ఒక్కసారిగా పరేషాన్ అయ్యారు. -
ఓసీలు బీసీలుగా.. బీసీలు ఎస్సీలుగా..
ఇబ్రహీంపట్నం పురపాలికలో 8–120 ఇంట్లో ఇద్దరు కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటుండగా.. 144 ఓటర్లు ఉన్నట్లు నమోదు చేశారు. 8–119 ఇంటిలో నివసిస్తున్న నలుగురిలో ఒకరికే ఓటు ఉండగా.. ఈ ఇంటి పేరు మీద ఏకంగా 60 ఓట్లను ఎక్కించారు. 6–72లో 102 ఓట్లు, 6–28లో 105 ఓట్లు ఎక్కించారు. హుజూర్నగర్ మున్సిపాలిటీలో 6వ వార్డులో ఉండాల్సిన ఓట్లు 7వ వార్డులో, 9వ వార్డులో ఓట్లు 10వ వార్డులో చేర్చారన్న ఆరోపణలున్నాయి. 6, 7, 9, 10, 11 వార్డుల ఓటర్ల జాబితాల తయారీలో అవకతవకలు జరిగాయన్నది స్థానికుల వాదన. ఇది వార్డులు రిజర్వేషన్ల ఖరారుపై కూడా ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఓటరు జాబితా అవకతవకలపై 26 దరఖాస్తులు అందగా, వందల సంఖ్యలో ఓటర్లు తమ ఓట్లు ఎక్కడున్నాయో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. పట్టణానికి చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు. సాక్షి, హైదరాబాద్ : ఈ రెండు పురపాలికల్లోనే కాదు రాష్ట్రంలోని మిగతా చోట్ల కూడా ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఇల్లు కట్టని ప్లాట్లలో కుటుంబాలకు కుటుంబాలే జీవిస్తున్నట్లు ఓ గందరగోళ జాబితా తయారీలో అధికారులు, రాజకీయ నాయకులు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఓపెన్ ప్లాటే కాదు.. ఆఖరికి సర్వే నంబర్లలోనూ ఓటర్లున్నట్లు నమోదు చేశారు. పెద్ద అంబర్‌పేట పురపాలక సంఘం పరిధిలోని 7వ నంబర్ వార్డులో మొత్తం 1,615 మంది ఓటర్లలో ఏకంగా 588 మంది ఒకే సర్వే నంబర్, ఓపెన్ ప్లాట్‌లో నివాసమున్నట్లు జాబితాలో పొందుపరిచారు. అదే మున్సిపాలిటీలోని 15 వార్డులో ఒక కంపెనీలో పనిచేస్తున్న 211 మంది స్థానికేతరులను కూడా సర్వే నంబర్ ఆధారంగానే జాబితాలోకి ఎక్కించారు. ఆఖరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపులోనూ ఇలాంటి సిత్రాలెన్నో జరిగాయి. ఇంటింటికి తిరగకుండానే కార్యాలయాల్లో కూర్చొని ఓటర్ల జాబితా కూర్పు చేయడంతో ఓసీలు బీసీలుగా.. బీసీలు కాస్తా ఎస్సీలుగా నమోదయ్యారు. హడావుడితో ఆగమాగం! సాధ్యమైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో వార్డుల విభజన, ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా రూపొందించారు. వార్డుల విభజనలో తప్పులు దొర్లడం.. కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు వార్డుల్లో నమోదు కావడమే కాకుండా.. ఆఖరికి భార్యాభర్తల ఓట్లను కూడా విడగొట్టడంతో పురపాలక శాఖ పనితీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు ఓటర్ల జాబితా షెడ్యూల్‌ను తరచూ కుదింపు.. పొడిగింపు చేస్తుండటం కూడా విమర్శలకు తావిస్తోంది. వార్డుల ఖరారులో శాస్త్రీయత పాటించకపోవడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా తయారీలో చోటుచేసుకున్న అక్రమాలపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఇప్పటికే శంషాబాద్, భైంసా, ఇబ్రహీంపట్నం, మీర్‌పేట, బండ్లగూడ జాగీర్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ మున్సిపాలిటీల ఎన్నికలపై స్టే విధించింది. ఈ కోవలోనే మరికొందరు కోర్టు మెట్లెక్కేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 129 మున్సిపాలిటీలు, మూడు నగర పాలక సంస్థలకు ఆగస్టు రెండో వారంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజకీయ ఒత్తిళ్లు.. వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీపై రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓటర్ల జాబితాలో ఏకంగా ఓపెన్ ప్లాట్, సర్వే నంబర్లలో స్థానికేతరుల పేర్లను నమోదు చేస్తున్నారంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ఎన్నికల తంతును త్వరితగతిన పూర్తి చేయాలనే ప్రభుత్వ నిర్ణయం మున్సిపల్ యంత్రాంగంపై ప్రభావం చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితాలో నమోదవుతున్న పేర్లను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా యథాతథంగా అచ్చేస్తుండటం ఈ ఆరోపణలకు అద్దంపడుతోంది. -
బస్‌లో ప్రయాణించే మహిళలే వీరి టార్గెట్
సాక్షి, మిర్యాలగూడ : బస్టాండ్‌లో బస్సు ఎక్కే మహిళల దృష్టిని మరల్చి బంగారం, నగదును అపహరించే ముగ్గురు మహిళా దొంగల ముఠా సభ్యులను వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సస్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సదానాగరాజు కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన దనుగుల కవిత, కోదాడ పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన సంపంగి సైదమ్మ, సంపంగి తిరుపతమ్మలు ముఠాగా ఏర్పడ్డారు. బస్టాండ్‌లో బస్సు ఎక్కే మహిళల హాండ్‌బ్యాగ్‌లు, పర్సులు, దొంగలిస్తారని తెలిపారు. ప్రధానంగా నల్లగొండ, మిర్యాలగూడ బస్టాండ్‌లో రద్దీగా ఉండే బస్సులను ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలి పారు. ఇదే క్రమంలో 2017లో మిర్యాలగూడ బస్టాండ్‌లో, 2019 ఫిబ్రవరిలో డాక్టర్స్ కాలనీలో ఒక మహిలతో మాటలు కలిపి ఆమె వద్ద ఉన్న చేతి సంచిలోంచి రూ.50వేల నగదు, ఇదే ఏడాదిలో మార్చిలో బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న మహిల నుంచి బంగారు ఆభరణాలు అపహరించారని తెలిపారు. అదే విధంగా నల్లగొండ, హాలియా, సాగర్ బస్టాప్ వద్ద మహిళలు బస్సు ఎక్కుతుండగా పర్సు కొట్టేశారని తెలిపారు. మిర్యాలగూడలో దొంగిలించిన బంగారు ఆబరణాలను విక్రయించేందుకు వెళుతున్న క్రమంలో పట్టణంలోని గణేష్ మార్కెట్ వద్ద తనిఖీల్లో పట్టుకున్నామని తెలిపారు. వీరి వద్ద నుంచి 6.5 తులాల బంగారం, రూ.15వేల నగదు ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. మహిళా దొంగలను అరెస్టు చేయడంలో సహకరించిన ఎస్ఐ.రజిననీకర్, కుర్మయ్య, కానిస్టేబుల్ రవి, హోంగార్డు కిరణ్‌కుమార్‌లను అభినందించారు. -
‘మిర్యాల’వాసికి బెస్ట్ ఆర్ట్ టీచర్ అవార్డు
మిర్యాలగూడ టౌన్ : బాలబాలికల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు చిత్రలేఖనంలో విద్యార్థులకు జాతీయ, రాష్ట్ర స్థాయిలలో ఉత్తమ అవార్డులను సాధించేందుకు కృషి చేసిన మిర్యాలగూడ పట్టణానికి చెందిన చిత్రకారుడు యినుగుర్తి విజయ్‌కుమార్‌కు బెస్ట్ ఆర్ట్ టీచర్ అవార్డ్ దక్కింది. బుధవారం ప్రతాఫ్, వీణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ హైదరాబాద్ వారు పోట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో చిత్రకారుడు విజయ్‌కుమార్‌కు ఆ నలుగురు సినిమా డైరెక్టర్ సి. చంద్రసిద్దార్ధ చేతుల మీదుగా బెస్ట్ ఆర్ట్ టీచర్ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ స్టేట్ ఆర్ట్ గాలరీ డి. మనోహర్, లిమ్కాబుక్ అవార్డు గ్రహీత డాక్టర్ దార్ల నాగేశ్వర్రావు, ప్రముఖ చిత్రకారుడు టీవీఎస్బీఎస్ శాస్త్రీ, బాపూజీ, రమణ, సంస్థ డైరెక్టర్లు రామ్ ప్రతాఫ్, వీణ తదితరులున్నారు. -
ఆరుగురు నకిలీ జర్నలిస్టుల అరెస్ట్
బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక పత్రిక, టీవీ ఛానల్ పేరు చేప్పి డబ్బులు వసూలు చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో క్లీనిక్ నిర్వహిస్తున్న బోజ్జ రమేష్ అనే ఆర్ఎంపీ డాక్టర్‌ను కొందరు వ్యక్తులు "నీ దగ్గర అనుమతి లేకున్నా ల్యాబ్ నిర్వహిస్తున్నావంటూ ఈ విషయాన్ని పత్రికల్లో, టీవీల్లో వచ్చేలా చేసి.. నీ జీవితాన్ని రోడ్డు మీదకు లాగుతామని" బెదిరించి..లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో భయపడి పోయిన డాక్టర్ అంత డబ్బు ఇవ్వలేనని... 20 వేలు మాత్రం ఇవ్వగలని చెప్పాడు. డబ్బు కోసం మిర్యాలగూడకు రావాల్సిందిగా ముఠా సభ్యులకు చెప్పాడు. అదే సమయంలో పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠాలోని ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
విద్యుదాఘాతంతో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని క్రిష్ణాపురంలోని బేట్టే తండాకు చెందిన రామావత్ శారదకు ఇంట్లో కరెంటు వైరులు తగలి షాక్ కొట్టింది. దీంతో శారద అక్కడికక్కడే మృతి చెందింది. అయితే మరో మహిళకు కూడా షాక్ తగలినప్పటికీ స్వల్పగాయాలతో బయటపడింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
85.86% తొలి విడత పోలింగ్
చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం నల్లగొండ, న్యూస్‌లైన్, ప్రాదేశిక ఎన్నికల తొలి విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్ల పరిధిలోని 33 మండలాలకు ఎన్నికలు జరిగాయి. తొలి విడత ఎన్నికల్లో మొత్తం 11,94,075 ఓట్లు కాగా, 10,25,195 ఓట్లు పోల య్యాయి. 85.86 శాతం పోలింగ్ నమోదైంది. మూడు డివిజన్ల పరిధిలోని ఎంపీటీసీ 459 స్థానాలు, జెడ్పీటీసీ 33 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఎంపీటీసీ స్థానాలకు 1,699 మంది, జెడ్పీటీసీ స్థానాలకు 213 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పురుషులకు సరిసమానంగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు మండలాల నుంచి పోలైన ఓట్లకు సంబంధించి వివరాలు విడివిడిగా రావడం ఆలస్యం కావడంతో అధికారులు ఆమేరకు పురుషులు, మహిళల ఓటర్ల సంఖ్యను నిర్ధారించలేకపోయారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. కాగా తుంగతుర్తి, వేములపల్లి, చందంపేట, మిర్యాలగూడ మండలాల పరిధిలో రాత్రి పొద్దుపోయే వరకు పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్న ఓటర్లను ఓటు వేసేందుకు అవకాశం కల్పించడంతో ఆయా స్థానాల్లో ఎన్నికల తంతు ఆలస్యంగా ముగిసింది. తుంగతుర్తిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడం వల్ల పోలింగ్ మరింత జాప్యమైంది. రికార్డు స్థాయిలో పోలింగ్... ఎండతీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ 12 శాతం నమోదు కాగా, ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 11 గంటలకు 31 శాతంగా నమోదైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55 శాతానికి పెరిగింది. దాదాపు మొత్తం పోలింగ్ శాతం సగానికి పూర్తయ్యింది. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల వరకు 31 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కాగా, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసే సమయానికి కేవలం 16.85 శాతంతో పూర్తయింది. పలు చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులుతీరడంతో పోలీసులు, పోలింగ్ సిబ్బంది కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డివిజన్ కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు... పోలింగ్ పూర్తయిన తర్వాత పోలీసుల సాయంతో బ్యాలెట్ బాక్సులను రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు తరలించారు. తొలుత నియోజకవర్గ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలనకున్నారు. అయితే సుప్రీంకోర్టు ఓట్ల లెక్కింపు మే నెలకు వాయిదా వేయాలని ఆదేశించడంతో ఎన్నికల కమిషన్ ఈ మార్పు చేయాల్సి వచ్చింది. ఓట్ల లెక్కింపు కూడా డివిజన్ కేంద్రాల్లోనే నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.దామోదర్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. తాగునీరూ కరువే.... పోలింగ్ కేంద్రాలో ఓటర్లకు సౌకర్యాలు కల్పించడంతో అధికార యంత్రాంగం తీవ్రంగా విఫలమైంది. కనీసం గొంతు తడుపుకునేందుకు మంచినీళ్లు సమకూర్చిన పాపాన పోలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు కూడా వేయలేదు. దీంతో ఓటర్లు ఎర్రటి ఎండలోనే గంటల తరబడి క్యూలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వచ్చింది. అర్వపల్లిలోని 24వ పోలింగ్ బూతు వద్ద ఎండలోనే గంటల కొద్దీ ఓటర్లు బారులు తీరారు. అయినా క్యూ ముందుకు వెళ్లకపోవడంతో మహిళా ఓటర్లు ఒక్కసారిగా కేంద్రంలోకి చొచ్చుకపోయారు. అధికారుల తప్పిదం... ప్రాదేశిక ఎన్నికల నిర్వహణలో అధికారుల తప్పిదం కొట్టొచ్చినట్లు కనిపించింది. వేములపల్లి -1 ఎంపీటీసీ పరిధిలోని పోలింగ్ కేంద్రం 36 (ప్రభుత్వ ఉన్నత పాఠశాల)లో చెట్లచెన్నారం గ్రామానికి సంబంధించిన రెండు ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్లు అందజేశారు. ఓటర్లు గుర్తించేంత వరకుగానీ అధికారులు మేల్కోలేదు. ఓటర్లు అభ్యంతరం చెప్పడంతో చివరకు పరిశీలించారు. దీంతో 45 నిమిషాల పాటు పోలింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. తప్పును సరిదిద్దాక పోలింగ్‌ను కొనసాగించారు.