మిర్యాలగూడ టౌన్ : బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తీసుకువచ్చిన తెల్ల రేషన్‌కార్డు (బీపీఎల్) నేడు బియ్యానికి తప్ప దేనికీ పనికి రాకుండా పోయిందని పట్టణానికి చెందిన వీవీఎస్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తూ శనివారం ఆర్డీఓ కార్యాలయం వద్ద డీఏఓ రఘునాథ్, నాయబ్ తహసీల్దార్ జి. రామకృష్ణారెడ్డికి కార్డును అందజేశాడు. రేషన్ కార్డు ద్వారా గతంలో బియ్యం, చింతపండు, పప్పు, కారం, పామాయిల్‌లతో పాటు పలు రకాల నిత్యావసర సరుకులు ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి ప్రభుత్వం లబ్ధిదారులకు అందించేది.. ఇటీవల బియ్యంతో పాటు పంచదార అడపదడప వస్తుంది. కాని మిగిలిన ఏ నిత్యవసర వస్తువులు కూడా రాకుండా ప్రభుత్వం కోత విధించింది. దీంతో నిరుపేదల లబ్ధిదారుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఈ కార్డు బియ్యానికి తప్ప.. మరేదానికి ఎలాంటి ఉపయోగం లేదని, తన రేషన్ కార్డును పట్టణంలోని మెయిన్ బజారుకు చెందిన వీవీఎస్ కుమార్ డీఏఓ, నాయబ్ తహసీల్దార్‌లకు అందించాడు. దీంతో అధికారులు ఒక్కసారిగా పరేషాన్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment