స్పోర్ట్స్‌స్కూల్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఆదర్శ విద్యార్థులు | modle school students selected state leval sports | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌స్కూల్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఆదర్శ విద్యార్థులు

Published Tue, Jul 19 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

modle school students selected state leval sports

కాటారం: తెలంగాణ క్రీడాపాఠశాలలో ప్రవేశం కోసం నిర్వహించే రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు మండలంలోని ఆదర్శవిద్యాసంస్థలకు చెందిన 13 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 12, 13 తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ఆదర్శపాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చడంతో నిర్వాహాకులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేశారు. ఎంపికైన వారిలో నితీశ్, సాయికిరణ్, రంజిత్, శ్రీను, సింహాద్రి, అభికుమార్, కల్యాణ్, సాయిచరణ్, సాయిప్రసన్న, శైలజ, భువనకృతి, స్వర్ణలత, అఖిల ఉన్నారు. జిల్లా నుంచి ఎంపికైన వారిలో సగం మంది ఆదర్శవిద్యార్థులే. వీరంతా ఈ నెల 21, 22 తేదీల్లో హకీంపేటలోని క్రీడాపాఠశాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. ఎంపికైన విద్యార్థులను విద్యాసంస్థల అధినేత జనగామ కార్తీక్‌రావు, ప్రిన్సిపాల్‌ కృషితరావు, వెంకటేశ్వరరావు, కోచ్‌లు మార్క రాముగౌడ్, అంకూస్, సమ్మయ్య అభినందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement