పశ్చిమ డెల్టాకు నీటి విడుదల పెంపు
పశ్చిమ డెల్టాకు నీటి విడుదల పెంపు
Published Sat, Jun 3 2017 12:30 AM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM
కొవ్వూరు : పశ్చిమ డెల్టా కాలువకు సాగు నీటి అవసరాల నిమిత్తం మూడు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. గురువారం పశ్చిమ డెల్టా కాలువలకు నీరు విడుదల చేశారు. మొదటి రోజు కావడంతో తొలుత 100 క్యూసెక్కులు, దశలవారీగా 500 క్యూసెక్కులకు పెంచారు. శుక్రవారం ఉదయం రెండు వేల క్యూసెక్కు లు విడుదల చేసిన అధికారులు క్రమేణా సాయంత్రానికి మరో వెయ్యి క్యూసెక్కులు పెంచి విడుదల చేస్తున్నారు. శనివారం నుంచి ఏ కాలువకు ఎంత నీరు విడుదల చేస్తున్నామో షెడ్యూలు వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 3,400 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు. దీనిలో తూర్పు, సెంట్రల్ డెల్టాలకు రెండు వందల క్యూసెక్కుల చొప్పున, పశ్చిమ డెల్టాకు 3 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శుక్రవారం సాయంత్రం నీటిమట్టం 13.78 అడుగులుగా నమోదైంది. ఆనకట్ట నీటిసామర్థ్యం కంటే అదనంగా నీరు నిల్వ ఉండడంతో ధవళేశ్వరం ఆర్మ్‌లో ఐదు గేట్లు, విజ్జేశ్వరం ఆర్మ్‌లో మూడు గేట్లను 0.20 మీటర్లు ఎత్తులేపి 4,825 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.
Advertisement