నాన్నే నాకు ప్రేరణ | my father is my inspiration | Sakshi
Sakshi News home page

నాన్నే నాకు ప్రేరణ

Published Sun, Jun 19 2016 11:36 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

నాన్నే నాకు ప్రేరణ - Sakshi

నాన్నే నాకు ప్రేరణ

తాడేపల్లిగూడెం :  బంధాలకు విలువ ఇస్తూ.. ధైర్యంగా, నిజాయితీగా ఎలా బతకాలనే విషయంలో నాన్నే నాకు ప్రేరణ. నాన్నతో తండ్రిగా కంటే.. స్నేహితురాలిగా అన్ని విషయాలనూ షేర్ చేసుకుంటుంటాను. నాన్నలో కష్టపడే తత్వం అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆయనే ఆదర్శం. కుటుంబ సభ్యులపై ఆయన చూపే వాత్సల్యం, కుటుంబంతో ఆయన మమేకమైన తీరును నాన్నమ్మ చెబుతుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది.

ఈ విషయంలో ఆయన నాకు రోల్‌మోడల్. బిడ్డ వ్యక్తిత్వాన్ని, ఇష్టాయిష్టాలను గౌరవించే తండ్రి నాకు దొరకడం అదృష్టం. ప్రతి సమస్యనూ ఒంటరిగానే ఎదుర్కోవాలంటారు నాన్న. నాన్న నా పక్కన ఉంటే కొండంత ధైర్యం. ఎప్పుడైనా డిప్రెషన్ అనిపిస్తే వెంటనే నాన్న దగ్గరకు వెళతా. నాన్నకు కుదిరినప్పుడు ఆయనతో మార్నింగ్ వాక్‌కు వెళుతుంటా. నడిచే దారిలో చాలా విషయాలు చెబుతారు. నాన్న, నేను కలిసి అమ్మను ఆటపట్టిస్తుంటాం. అమ్మ మా ఇద్దర్నీ ఆటపట్టిస్తుంటుంది. ఏడు నదుల పుష్కరాలకు నాన్నతో కలిసి వెళ్లా.
 - గట్టిం సింధు, పైడికొండల మాణిక్యాలరావు కుమార్తె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement