దుర్గగుడి ఈవోగా మళ్లీ నర్సింగరావు ! | Narasinga Rao re appointed vijayawada durga temple eo | Sakshi
Sakshi News home page

దుర్గగుడి ఈవోగా మళ్లీ నర్సింగరావు !

Published Wed, Mar 30 2016 8:34 AM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM

Narasinga Rao re appointed vijayawada durga temple eo

విజయవాడ : దుర్గగుడి కార్యనిర్వహణాధికారిగా సీహెచ్ నర్సింగరావు తిరిగి రానున్నారని ఇంద్రకీలాద్రి పై ప్రచారం జరుగుతోంది. ఈవో వేధింపుల కారణంగా దుర్గగుడి అర్చకుడు సుబ్బారావు అనారోగ్యం పాలయ్యారని ఇటీవల అర్చకులంతా ధర్నా చేసిన విషయం విదితమే. దీనికి తోడు తన కుమారుడి వివాహం ఉండటంతో ఈ నెల 10న సీహెచ్ నర్సింగరావు సెలవు పై వెళ్లారు. ఆయన తిరిగి 31న విధుల్లో చేరాల్సి ఉంది. అయితే నర్సింగరావు స్థానంలో చంద్ర శేఖర్ ఆజాద్ ఈవో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నర్సింగరావు తిరిగి వస్తే ఆయనకు బాధ్యతలు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.
 
నాకు సమాచారం లేదు
తన సెలవు పూర్తవగానే దేవాదాయశాఖ కమిషనర్‌కు జాయినింగ్ ఆర్డర్ పంపుతానని, ప్రభుత్వం ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ చేరతానని నర్సింగరావు మంగళవారం తెలి పారు. తిరిగి దేవస్థానం ఈవోగా రావడం పై తనకు ఇప్పటి వరకు స్పష్టమైన ఆదేశాలు  రాలేదని చెప్పారు. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా చేస్తానని పేర్కొన్నారు. అర్చకుడు సుబ్బారావు కోలుకున్నారని సిబ్బంది ద్వారా తెలిసి చాలా సంతోషించానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement