narasinga rao
-
పెందుర్తిలో టీడీపీ నేత రాక్షసత్వం
పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ నేతల దుశ్శాసన పర్వం కొనసాగుతోంది. చింతగట్ల పంచాయతీ నందవరపువానిపాలెంలో ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళపై పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు చీపురపల్లి నరసింగరావు రాక్షసంగా దాడి చేయడంతో పాటు ఆమె వద్ద ఉన్న రూ.5 లక్షలు, బంగారు ఆభరణాలను తస్కరించాడు. తీవ్ర గాయాలతో దాదాపు నాలుగు రోజుల పాటు నిందితుడు, అతడి కుటుంబ సభ్యుల చేతిలో బందీగా ఉండి సక్రమంగా చికిత్స అందక నరకయాతన అనుభవించిన ఆ అభాగ్యురాలు.. తెగించి శనివారం పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు.. బాధితురాలి కథనం ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన మహిళ భర్తతో విభేదాల కారణంగా విశాఖ గోపాలపట్నం ప్రాంతంలో బ్యుటీషియన్‌గా పనిచేసేది. మూడేళ్ల కిందట నందవరపునవానిపాలెంలో చింతగట్ల పంచాయతీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న చీపురపల్లి నరసింగరావు వద్ద ఇంటి స్థలాన్ని కొని అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలో ఇంటి స్థలం కొన్న చనువుతో ఆమె వద్దకు తరచూ నరసింగరావు వస్తూ ఆమెను లోబరుచుకున్నాడు. ఎంతో ప్రేమ నటిస్తూ ఆరి్థక అవసరాలు కూడా తీర్చుకునేవాడు. ఈ వ్యవహారంలో నరసింగరావు భార్య చిన్ని కూడా ‘నువ్వు లేకపోతే నా భర్త ఉండలేడు.. మీ ఇద్దరూ కలిసి ఉండండి’ అంటూ బాధితురాలిని ఒప్పించడం గమనార్హం. ఇలా సహజీవనం సాగిస్తున్న తరుణంలో నరసింగరావు ప్రవర్తనలో మార్పు రావడంతో అతడిని దూరం పెట్టింది. యాసిడ్‌తో దాడి చేసి.. నరసింగరావుకు ఆమె దూరంగా ఉండటంతో అతడు సహించలేకపోయాడు. ఆమె ఇంటికి వెళ్లి కొడుతూ ఉండేవాడు. అలా నరసింగరావు వేధిస్తూ ఉంటుంటే.. అతడి భార్య చిన్ని వచ్చి బాధితురాలికి సర్ది చెబుతూ ఉండేది. ఈ క్రమంలో ఈ నెల 7 మధ్యాహ్నం 2.30 సమయంలో నరసింగరావు ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆమె దుస్తులు చింపేసి యాసిడ్‌ను ఆమెపై చల్లాడు. దీంతో ఆమె ఛాతి భాగం కాలిపోయింది. అంతటితో ఆగకుండా ఆమె పొత్తికడుపు, మెడపై పిడిగుద్దులు గుద్దుతూ పేట్రేగిపోయాడు. బాధితురాలు అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో ఆమె బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలను దొంగిలించాడు. ఇంట్లో గొడవను గుర్తించిన స్థానికులు రావడంతో నిందితుడు నరసింగరావు గోడ దూకి పారిపోయినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే బాధితురాలికి ఏదైనా అయితే తన మెడకు చుట్టుకుంటుందన్న భయంతో ఆమెను నరవలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. తన భార్య, కుటుంబ సభ్యులను ఆమె వద్ద కాపాలా ఉంచి అరకొర చికిత్సను అందించాడు. ఈ నాలుగు రోజుల పాటు ఆమె ఎక్కడుందో ఆమె బంధువులకు కూడా తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే ఆస్పత్రి నుంచి బాధితురాలు బయటికొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను కేజీహెచ్‌కు తరలించినట్టు పోలీసులు చెప్పారు. -
నిజాం నిరంకుశత్వంపై నినదించిన ‘మా భూమి’
సాక్షి, హైదరాబాద్: ‘మా భూమి’ ఒక సినిమా మాత్రమే కాదు. ఒక చారిత్రక దృశ్యకావ్యం. తెలుగు సినీచరిత్రలోనే ఒక అద్భుతమైన ప్రయోగం. నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల అకృత్యాలను, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని సమున్నతంగా ఎత్తిపట్టిన సామాజిక చిత్రం. నలభై రెండేళ్ల క్రితం విడుదలైన ‘మా భూమి’సినిమా ఇప్పటికీ ప్రేక్షాకాదరణను పొందుతూనే ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమా ఒక చర్చనీయాంశం. సాయుధపోరాటాన్ని, తెలంగాణలో పోలీస్ యాక్షన్ కాలాన్ని ‘మాభూమి’లో చిత్రీకరించారు. రజాకార్ల దోపిడీ, దౌర్జన్యాలను, హింసను చూసిన హైదరాబాద్ రాజ్యం పోలీసు యాక్షన్‌తో భారత యూనియన్‌లో భాగమైంది.ఆ నాటికి ఒక కీలకమైన దశాబ్ద కాలాన్ని అద్భుతమైన మా భూమి సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు చిత్ర నిర్మాత, సంగీత దర్శకులు బి. నర్సింగ్‌రావు. అప్పటి అనుభవాలు ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... నిర్మాత నర్సింగరావుతో నటుడు సాయిచంద్ అదొక ప్రయోగం.. ‘మా భూమి’ సినిమా ఒక ప్రయోగం.అప్పటి వరకు సినిమా తీసిన అనుభవం లేదు. నటీనటులు కూడా అంతే. స్టేజీ ఆర్టిస్టులు. సాయిచంద్ బహుశా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. క్రికెట్ ఆడుతుండగా తీసుకెళ్లాం, ఆయనకు అదే మొదటి సినిమా. కాకరాల, భూపాల్‌రెడ్డి, రాంగోపాల్, తదితరులంతా రంగస్థల నటులు. సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకుడు గౌతమ్‌ఘోష్ అందరం కలిసి ఒక ఉద్యమంలాగా ఈ సినిమా కోసం పని చేశాం. ►1978 నుంచి 1980 వరకు సినిమా నిర్మాణం కొనసాగింది. చిత్రం షూటింగ్ ప్రారంభోత్సం నుంచి లెక్కిస్తే ఇప్పటికి 44 ఏళ్లు. విడుదలైనప్పటి నుంచి అయితే 42 సంవత్సరాలు. సినిమా విడుదలైన రోజుల్లో సినిమా టాకీస్ల వద్దకు జనం పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేవారు. సినిమా టాకీసులన్నీ జాతర వాతావరణాన్ని తలపించేవి. హైదరాబాద్‌లో ఈ సినిమాకు అపూర్వమైన ఆదరణ లభించింది. దర్శకుడు గౌతమ్‌ఘోష్ మా భూమిని అత్యంత ప్రతిభావంతంగా, సృజనాత్మకంగా, ఒక దృశ్యకావ్యంలా చిత్రీకరించారు. ‘మా భూమి’ సినిమాలోని సన్నివేశాలు హైదరాబాద్‌లో చిత్రీకరణ... మా భూమి సినిమాను చాలా వరకు మొదక్ జిల్లా మంగళ్పర్తి, దొంతి గ్రామాల్లో , శివంపేట గడీలో చిత్రీకరించాము. విద్యుత్ సదుపాయం కూడా లేని ఆ రోజుల్లో పగటిపూటనే చీకటి వాతావరణాన్ని చిత్రీకరించి సినిమా షూటింగ్ చేశాం.రజాకార్ల దాడి , కమ్యూనిస్టుల పోరాటాలు వంటి కీలకమైన ఘట్టాలను చిత్రీకరించే సమయంలో కళాకారులకు దెబ్బలు కూడా తగిలేవి. గాయాలకు కట్టుకట్టేందుకు రోజుకు ఒక అయోడిన్ బాటిల్ చొప్పున వినియోగించిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో చాలా చోట్ల సినిమా చిత్రీకరణ జరిగింది. హైదరాబాద్ నగర సంస్కృతిని ప్రతిబింబించేవిధంగా ఆఫ్జల్‌గంజ్‌లోని ఇరానీ హాటల్లో ఒక సన్నివేశాన్ని తీశాం. అలాగే కార్వాన్, జాహనుమా, జూబ్లీహాల్, వనస్థలిపురం, నయాఖిల్లా, సాలార్జంగ్ మ్యూజియం, కాలాగూడ, తదితర ప్రాంతాల్లో మా భూమి సినిమా తీశాం. కథానాయిక చంద్రి నివాసం, గుడిసెలు అంతా హైదరాబాద్‌లోనే సెట్టింగ్ వేశాం.ఈ సినిమా ఒక అద్భుతమైన అనుభవం. అందరికీ ఒకే కిచెన్ ఉండేది. అందరం కలిసి ఒకే చోట భోజనాలు చేసేవాళ్లం. లారీల్లో ప్రయాణం చేసేవాళ్లం, ప్రజలు కళాకారులే... ఆ రోజుల్లో కేవలం రూ.5.40 లక్షలతో ఈ సినిమా పూర్తయింది. ఆర్టిస్టులకు రూ.300, రూ.500, రూ.1000 చొప్పున ఇచ్చాం.చాలా మంది స్వచ్చందంగా నటించారు. సగం మంది ఆర్టిస్టులు ఉంటే మిగతా సగం మంది ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలే. షూటింగ్ సందర్శన కోసం వచ్చిన వాళ్లే ఆర్టిస్టులయ్యారు. ఒకసారి 80 మంది గ్రామస్తులకు ఆ రోజు కూలి డబ్బులు మాత్రమే చెల్లించి సినిమా షూటింగ్లో భాగస్వాములను చేశాం.అప్పటి తెలంగాణ సమాజాన్ని, రజాకార్ల హింసను, పోలీసు చర్య పరిణామాలను ఈ సినిమా ఉన్నదున్నట్లుగా చూపించింది. ‘ అని వివరించారు. బండెనుక బండి కట్టి... ఈ సినిమాలో ప్రజాగాయకుడు గద్దర్ పాడిన పాట అప్పటి నిజాం రాక్షస పాలన, జమీందార్ల దౌర్జన్యాలపైన ప్రజల తిరుగుబాటును కళ్లకు కట్టింది. ‘బండెనుక బండి కట్టి. పదహారు బండ్లు కట్టి.. నువు ఏ బండ్లె పోతవురో నైజాము సర్కరోడా....’ అంటూ గద్దర్ ఎలుగెత్తి పాడిన ఆ పాటు ప్రజలను పెద్ద ఎత్తున కదిలించింది. నిజాం నిరంకుశ పాలనపైన, దొరలు, జమీందార్ల పెత్తనంపైన ప్రజాగ్రహం పెల్లుబికేవిధంగా ఈ పాట స్ఫూర్తిని రగిలించింది. -
నాసిరకం బ్యాటరీల వల్లే పేలుళ్లు
సాక్షి, హైదరాబాద్: చార్జింగ్ చేస్తుండగా పేలిన స్కూటర్ బ్యాటరీ.. దగ్ధమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు.. ఇలాంటి ఘటనలు ఈమధ్య కాలంలో తరచూ సంభవిస్తున్నాయి. తాజాగా సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో 8 మంది మృతికి కారణం ఎలక్ట్రిక్ స్కూటర్ చార్జింగ్ సమయంలో చెలరేగిన పేలుడేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దేశవ్యాప్తంగా ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఇటీవల నలుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకుంది. ఆ కమిటీకి హైదరాబాద్ బాలాపూర్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ, న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) డైరక్టర్ (అదనపు చార్జి) తాతా నరసింగరావు నేతృత్వం వహించారు. ఆ కమిటీ సిఫారసులను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కేంద్రం అమల్లోకి తీసుకురానుంది. వాటి ప్రకారం నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే వాహనాలను తయారు చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం బ్యాటరీ వాహనాలంటేనే ప్రజలు బెదిరిపోయే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తాతా నరసింగరావు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాటి వాడకం, కేంద్రానికి చేసిన పలు సిఫార్సులను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. బ్యాటరీల ఎంపికలో రాజీ వల్లే.. ప్రస్తుతం విద్యుత్ వాహనాల బ్యాటరీలను కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే విద్యుత్ కార్లు తయారు చేసే బడా కంపెనీలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా మన్నిక ఉన్న బ్యాటరీలనే వాడుతున్నా స్కూటర్ల విషయంలో ఇది సరిగ్గా జరగట్లేదు. మధ్యతరగతికి అందుబాటు ధరల్లో ఉండేందుకు తయారీ ఖర్చును తగ్గించుకుంటున్నాయి. అందుకు బ్యాటరీల విషయంలో చాలా కంపెనీలు రాజీ పడుతున్నాయి. నాసిరకం బ్యాటరీలు వాడటంతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాటరీలకు కంట్రోలింగ్ యూనిట్ ఉంటుంది. బ్యాటరీ వేడెక్కినా, చార్జింగ్ ఎక్కువైనా పవర్ కట్ చేస్తుంది. వేడెక్కి పొగలొస్తే థర్మల్ సెన్సర్లు గుర్తించి అలారం మోగిస్తాయి. ఇవన్నీ ఉండాలంటే బ్యాటరీ ప్యాక్ ధర పెరుగుతుంది. తక్కువ ధర వాటిల్లో ఇవి సరిగ్గా ఉండవు. ఫలితంగా వినియోగంలో జరిగే పొరపాట్లతో అవి పేలిపోతున్నాయి. వినియోగదారులకు అవగాహన లేక.. ఎలక్ట్రిక్ వాహనాలను ఎట్టిపరిస్థితుల్లోనూ 100 శాతం చార్జింగ్ చేయకూడదు. 80 శాతం చార్జింగ్ పూర్తవ్వగానే ఆపేయాలి. ఒకవేళ చార్జింగ్ 20 శాతంకన్నా తక్కువ ఉంటే వాహనాన్ని ఎట్టిపరిస్థిత్లోనూ నడపొద్దు. అలాగే స్కూటర్ల చార్జింగ్కు కంపెనీ కొన్ని ప్రమాణాలు చూపుతుంది. దాని ప్రకారం కేటాయించిన చార్జింగ్ కేబుల్, సాకెట్‌నే వినియోగించాలి. వేగంగా విద్యుత్ చార్జ్ చేసేందుకు హైస్పీడ్ కేబుల్స్, ఎక్కువ శక్తి (యాంప్స్)ఉన్న సాకెట్లను వినియోగించొద్దు. ముఖ్యంగా రాత్రిళ్లు గంటల తరబడి చార్జింగ్ పెట్టి వదిలేయడం అత్యంత ప్రమాదకరం. మెలకువతో ఉన్నప్పుడే చార్జింగ్ పెట్టి దాన్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. ఏమాత్రం తేడా కనిపించినా ఆపేయాలి. అలాగే ఇతర వాహనాల మధ్య చార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేయొద్దు. గతుకుల రోడ్లపై ప్రమాదాలకు చాన్సెక్కువ.. చాలా మంది స్కూటర్లను ఇరుకైన రోడ్లు, ఎగుడుదిగుడు రహదారుల్లోనూ నడుపుతుంటారు. ఇలా గతుకుల రోడ్లపై వాహనం వేగంగా వెళ్లినప్పుడు బ్యాటరీ లోపల కదిలిపోయి లూజ్ కాంటాక్ట్‌కు అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల బ్యాటరీ వేడెక్కి పేలేందుకు అవకాశం కలుగుతుంది. కేంద్రానికి కమిటీ చేసిన సిఫారసుల్లో కొన్ని.. ►బ్యాటరీ ప్యాక్‌లో టెంపరేచర్ సెన్సర్లు అమర్చాలి. బ్యాటరీ ప్యాక్ వేడి 60 డిగ్రీలు దాటితే వెంటనే సెన్సర్లు గుర్తించి కంట్రోలింగ్ యూనిట్‌ను అప్రమ త్తం చేసేలా ఏర్పాటు చేయాలి. అప్పుడు అలారం మోగి వాహనదారులు అప్రమత్తమవుతారు. ►చార్జింగ్ అవుతున్నప్పుడు బ్యాటరీ వేడెక్కుతుంటే పవర్ నిలిచిపోయేలా సెన్సర్ల ఏర్పాటు ఉండాలి. ►బ్యాటరీలోని ప్రతి వరుసకు విడిగా ఒక ఫ్యూజు ఉండాలి. ►సెల్స్ దేశంలోనే తయారు కావాలి. దీనివల్ల ఆ కంపెనీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ►ఇవన్నీ విద్యుత్ వాహనాలకు కనీస ప్రమాణాలుగా ఉండాలి. ►విద్యుత్ వాహనాల విక్రయం, వినియోగం విషయంలో డీలర్లు, ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి. -
స్టీల్‌ప్లాంట్ ఉద్యమం మరింత ఉధృతం
సీతంపేట (విశాఖ ఉత్తరం): విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సి.హెచ్.నరసింగరావు తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాట కమిటీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఫిబ్రవరి 12 నాటికి 365 రోజులు పూర్తవుతున్న సందర్భంగా వార్షిక నిరసన తెలపడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫిబ్రవరి 12న 365 మందితో 365 ఐక్య జెండాలతో స్టీల్ ప్లాంట్ వద్ద నిరాహార దీక్షతో నిరసన చేపడతామన్నారు. 13న విశాఖ నగర బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. సొంత గనులు కేటాయించాలన్న డిమాండ్‌తో 23న విశాఖ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆ రోజు బంద్ రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని అన్ని రాష్ట్ర రాజకీయపార్టీలను, ప్రజా సంఘాలను కోరుతున్నట్టు తెలిపారు. విశాఖ ప్రజలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు, అన్ని వర్గాలు కోటి సంతకాల ఉద్యమంలో పాలుపంచుకునేలా చేసి.. భవిష్యత్‌లో జరిగే పోరాటంలో ప్రత్యక్షంగా పా ల్గొనేలా చేస్తామన్నారు. కోటి సంతకాల సేకరణ ద్వారా కేంద్రానికి నిరసన తెలియ జేస్తామన్నారు. ఈ సమావేశంలో పోరాట కమిటీ చైర్మన్, ఇంటక్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, వైఎస్సార్టీయూసీ ప్రధాన కార్యదర్శి వై.మస్తానప్ప, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.రామకృష్ణ, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి, పోరాటకమిటీ సభ్యులు జి.గణపతిరెడ్డి పాల్గొన్నారు. -
చిట్టివలస జూట్ మిల్‌ను మూసేందుకు ప్రభుత్వం కుట్ర
-
పోలీసులపైకి బ్రహ్మాస్త్రం
పంజగుట్ట: న్యాయపరమైన, చట్టానికి, రాజ్యాంగానికి సంబంధించిన సమాచారం తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయని అలాంటి సమాచారంతో కూడుకున్న పుస్తకం రావడం ఎంతో సంతోషకరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో న్యాయవాది, రచయత నర్సింగరావు రచించిన ‘ప్రభుత్వ అధికారుల, పోలీసుల పైకి బ్రహ్మాస్త్రం’ అనే పుస్తకాన్ని జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ రాజకీయ జెఏసీ చైర్మర్ ప్రొఫెసర్ కోదండరామ్‌లు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ .. సరళమైన భాషలో సామాన్య ప్రజలకు అర్దమయ్యే విధంగా ఎంతో క్లిష్టమైన విషయాలు పుస్తకంలో అందించారని కొనియాడారు. చట్టం, మానవహక్కులు, ప్రాథమిక హక్కులు, కలెక్టర్ విధులు, పోలీస్ ఉన్నతాధికారుల విధులు, పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తే ఏమి చేయాలి, బెయిల్ పొందడం ఎలా, పోలీసులు, ప్రభుత్వ అధికారులు నేరం చేసినా, అవినీతికి పాల్పడినా ఎవరికి ఫిర్యాదు చేయాలి లాంటి విషయాలు కూడా స్పష్టంగా పుస్తకంలో పొందుపర్చారని తెలిపారు. ప్రభుత్వం వారు ఈ పుస్తకాన్ని అన్ని జిల్లాల్లో అన్ని లైబ్రరీల్లో ఉంచాలని, హైకోర్టు వారు కూడా ఈ పుస్తకాన్ని ప్రతి కోర్టుకు పంపితే ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ... చట్టంపై, రాజ్యాంగంపై ప్రజలకు ఎంత తెలిస్తే వారి హక్కుల సాధనకోసం అంతగా ఐక్యమౌతారని అన్నారు. గతంలో బొజ్జాతారకం పోలీసులు అరెస్టు చేస్తే అనే పుస్తకం తెస్తే ప్రజలు ఇష్టంగా కొనుక్కుని చదివి తమ హక్కుల పరిరక్షణ కోసం ప్రయత్నం చేశారని, ఈ పుస్తకం కూడా అలాంటిదేనని అన్నారు. చట్టం కల్పిస్తున్న అనేక హక్కులు ట్రేడ్‌యూనియన్, కనీసవేతన చట్టాలు, మానవహక్కుల చట్టాలు పొందుపర్చి ఉందని ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందిన్నారు. పుస్తక రచయత నర్సింగ్‌రావు మాట్లాడుతూ ..పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా ఈ పుస్తకం వ్యతిరేకం కాదని, చట్ట విరుద్దమైన పనులు చేసిన వారికి బ్రహ్మస్త్రంలా ఉంటుందని పేర్కొన్నారు. -
దుర్గగుడి ఈవోగా మళ్లీ నర్సింగరావు !
విజయవాడ : దుర్గగుడి కార్యనిర్వహణాధికారిగా సీహెచ్ నర్సింగరావు తిరిగి రానున్నారని ఇంద్రకీలాద్రి పై ప్రచారం జరుగుతోంది. ఈవో వేధింపుల కారణంగా దుర్గగుడి అర్చకుడు సుబ్బారావు అనారోగ్యం పాలయ్యారని ఇటీవల అర్చకులంతా ధర్నా చేసిన విషయం విదితమే. దీనికి తోడు తన కుమారుడి వివాహం ఉండటంతో ఈ నెల 10న సీహెచ్ నర్సింగరావు సెలవు పై వెళ్లారు. ఆయన తిరిగి 31న విధుల్లో చేరాల్సి ఉంది. అయితే నర్సింగరావు స్థానంలో చంద్ర శేఖర్ ఆజాద్ ఈవో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నర్సింగరావు తిరిగి వస్తే ఆయనకు బాధ్యతలు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. నాకు సమాచారం లేదు తన సెలవు పూర్తవగానే దేవాదాయశాఖ కమిషనర్‌కు జాయినింగ్ ఆర్డర్ పంపుతానని, ప్రభుత్వం ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ చేరతానని నర్సింగరావు మంగళవారం తెలి పారు. తిరిగి దేవస్థానం ఈవోగా రావడం పై తనకు ఇప్పటి వరకు స్పష్టమైన ఆదేశాలు రాలేదని చెప్పారు. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా చేస్తానని పేర్కొన్నారు. అర్చకుడు సుబ్బారావు కోలుకున్నారని సిబ్బంది ద్వారా తెలిసి చాలా సంతోషించానని తెలిపారు. -
దుర్గగుడిపై మూడు స్తంభాలాట..?
నర్సింగరావుకు మద్దతుగా ఓ వర్గం హైదరాబాద్ ప్రయాణంపై అలజడి విజయవాడ : సెలవుపై వెళ్లిన దుర్గగుడి ఈవో నర్సింగరావు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో మూడు స్తంభాల ఆటలా మారినట్లు కనిపిస్తోంది. నర్సింగరావుకు మద్దతుగా ఓ వర్గం హైదరాబాద్ ప్రయాణమయితే అర్చకులు దీనికి వ్యతిరేకంగా ఆలయ ప్రాంగణంలో సమావేశమయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే పోలీసుల ఆంక్షలతో కట్టుదిట్టం చేశారు. అర్చకుడు సుబ్బారావు హాస్పటల్ పాలు కావడంతో ప్రారంభమైన వివాదం రెండు రోజులపాటు అర్చకులు, ఆలయ సిబ్బంది నిరసన దీక్షలు చేసే వరకు వెళ్లింది. అయితే ఇన్‌ఛార్జి ఈవోగా ఆజాద్‌ను నియమించడంతో పాటు కొన్ని పరిణామాల మధ్య వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. కీలక మలుపు ఓ అర్చకుడి ఇంటిలో బుధవారం సాయంత్రం దుర్గగుడి అర్చకులు కొంతమంది సమావేశం కావడంతో కీలక మలుపు చోటు చేసుకుంది. నర్సింగరావుకు మద్దతుగా హైదరాబాద్ వెళుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ అర్చకులు దుర్గగుడిపై సమావేశమయ్యేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ధర్మ ప్రచార సమితి రాష్ర్ట అధ్యక్షుడు జగన్మోహనరాజు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ఈవో అనుమతి లే కుండా అర్చకులు, సిబ్బంది మీడియాతో మాట్లాడితే వారిపై చర్యలు తీసుకుంటామనే ఆదేశాలుండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పేకాటాడుతూ పట్టుబడ్డ ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్
విశాఖ: విశాఖ జిల్లాలోని గాజువాకలో పేకాట ఆడుతూ ఓ ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్ శనివారం పట్టుబడ్డాడు. ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నర్సింగరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఎల్లుండి ఎస్పీ అమిత్ గార్గ్, హెడ్ కానిస్టేబుల్ నర్సింగరావుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు సమాచారం.