8న కర్నూలులో జాతీయ స్థాయి సున్ని ఇస్తెమా
Published Wed, Jan 4 2017 12:32 AM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM
కర్నూలు (ఓల్డ్‌సిటీ): మర్కజీ మిలాద్ కమిటీ, అహ్లె సున్నతుల్ జమాత్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన జాతీయ స్థాయి ఒక్కరోజు సున్ని ఇస్తెమా నిర్వహించనున్నట్లు అహ్లెసున్నతుల్ జమాత్ జిల్లా కార్యదర్శి సయ్యద్‌షా షఫిపాషా ఖాద్రి తెలిపారు. మంగళవారం పాతబస్తీలోని హజరత్ లతీఫ్ లావుబాలి దర్గా ఆవరణలో పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజ్మీర్ దర్గా సజ్జాదే నషీన్‌తో పాటు జాతీయ స్థాయి మౌల్వీలు వక్తలుగా హాజరవుతారని తెలిపారు. ఇస్తెమా ఉస్మానియా కళాశాల మైదానంలో ఉంటుందని, తెల్లవారు జామున ఫజర్ నమాజు మొదలుకుని రాత్రి ఇషా నమాజు వరకు కొనసాగుతుందన్నారు. మూడు పూటలా భోజన సదుపాయంతో పాటు ఐదు పూటలా నమాజులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ముస్లింలు అత్యధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో అహ్లె సున్నతుల్ జమాత్ ప్రతినిధులు సయ్యద్ ఆబిద్ హుసేని, సయ్యద్ ముర్తుజా ఖాద్రి, సయ్యద్ మాసుంపీర్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement