విద్యార్థులకు వివిధ ప్రోత్సాహకాలు
ఏడాదికి రూ.30 వేల వరకు అందజేత
కొత్త, రెన్యువల్‌కు ఆగస్టు 31వరకూ అవకాశం
బిక్కవోలు : మైనార్టీ కులాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత చదువుల అభ్యాసాన్ని కొనసాగించేందుకు ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సాంకేతిక, సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ద్వారా ‘జాతీయ ఉపకార వేతనం’ పథకం అందుబాటులో ఉంది. అర్హులైన వారిలో కొత్త, రెన్యువల్ కొరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఇంజినీరింగ్ వరకూ వృత్తి విద్య, సాంకేతిక విద్య అభ్యసించేందుకు ఆర్థిక ప్రోత్సాహకంగా వివిధ ఉపకార వేతనాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ ఉపకార వేతనాల మార్గదర్శకాల వివరాలు. ఈ ఉపకార వేతనం పొందేందుకు మైనార్టీ విద్యార్థులు (ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్, పర్సీ, జైన్) కులాలకు చెందిన వారు అర్హులు.
ఫ్రీమెట్రిక్ ఉపకార వేతనం:
1వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న మైనార్టీ విద్యార్థులు అర్హులు, నగదు ప్రోత్సాహం ఏడాది 1 నుంచి 5వ తరగతి వరకూ రూ.1,000 చెల్లిస్తారు. 6 నుంచి 10వ తరగతి వరకూ హస్టల్ విద్యార్థులకు ఏడాదికి రూ.10 వేలు, డేస్కాలర్స్ రూ.5 వేలు ఇస్తారు. విద్యార్థి తండ్రిలేదా సంరక్షకుని వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు ఉండాలి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ ఆగస్టు 31
పోస్ట మెట్రిక్ ఉపకార వేతనం:
ఇంటర్మీయట్, తత్సమాన కోర్సులు, అండర్ డిగ్రీ కోర్సులు చదువుతున్న వారు అర్హులు, ఇంటర్ విద్యార్థికి హస్టల్, డైస్కాలర్స్‌కు ఏడాదికి రూ.7 వేలు, తత్సమాన వృత్తి విద్యకు రూ.10 వేలు చెల్లిస్తారు. తండ్రి లేదా సంరక్షకుని వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ ఆగష్టు 31
మెరిట్ కమ్ మీన్స్ ఉపకార వేతనాలు
ఇంటర్ తర్వాత వృత్తి, సాంకేతిక కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు (ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ తదితర కోర్సులు) ఇందుకు అర్హులు, ఈ ప«థకంలో విద్యార్థికి రెండు విధాలుగా నగదు ప్రోత్సాహం ఉంటుంది. హస్టల్‌లో ఉండే విద్యార్థికి అయితే మెయింటెనెన్స్ అలవెన్స్ కింద ఏడాదికి రూ.10 వేలు, కోర్సు ఫీజు రూ.20 వేలు కలిపి మొత్తం రూ.30 వేలు అందజేస్తారు. డే స్కాలర్ విద్యార్థికి అయితే మెయింటెనెన్స్ అలవెన్స్ కింద రూ.5 వేలే, కోర్సు ఫీజు కింద రూ.20 వేలు మొత్తం కలిపి రూ.25 వేలు అందజేస్తారు. అభ్యర్థి కుటుంబ వార్షిక ఆధాయం రూ.2.5 లక్షలలోపు ఉండాలి. ఈ ఉపకార వేతనాలు ఈ ఏడాది కొత్తగా ఆంధ్రప్రదేశ్ 2,165 మందికి కేటాయించారు, కేంద్ర ప్రభుత్వం గుర్తించిన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్‌మొంట్ కింద చెల్లిస్తారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్ 31
ఆన్‌లైన్‌లో ఇలా :
www.rchorrhipr.gov.in అనే వెబ్‌సైట్‌లో కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు న్యూ యూజర్స్, రిజిస్ట్రర్ వద్ద క్లిక్ చేసి ముందుగా మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ టూ అప్‌లై అనే ట్యాగ్ వద్ద కొత్త వారు, అప్‌లైపర్ రెన్యూవల్ వద్ద రెన్యూవల్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి.
స్కానింగ్ చేసి పొందుపరచాల్సిన ధ్రువీకరణ పత్రాలు:
విద్యార్థి ఆధార్ కార్డు
సంతకంతో కూడిన ఫోటో
కోర్సుకు ముందు గత విద్యా సంవత్సరంలో పొందిన మార్కులు , పాస్ సర్టిఫికెట్ (రెన్యువల్ విద్యార్థులు గత ఏడాది మార్కుల జాబితా)
విద్యార్థి ఇచ్చిన సమాచారం పరిశీలించి ధ్రువపరుస్తూ సంబంధిత విద్యాసంస్థ ప్రిన్సిపాల్ ఇచ్చే సర్టిఫికెట్
సెల్ఫ్ డిక్లరేషన్‌తో కూడిన ఆదాయ ద్రువీకరణ పత్రం,నివాస ధ్రువీకరణ పత్రం
సెల్ఫ్ డిక్లరేషన్‌తో కూడిన కుల ధ్రువీకరణ పత్రం
విద్యాసంస్థకు ట్యూషన్, కోర్సు ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లించిన రశీదులు
ఏదైనా జాతీయ బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ (స్కేనింగ్‌లో ఫొటో, అడ్రస్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడాలి).
మరిన్ని సూచనలు ..
పదో తరగతి తర్వాత విద్యార్థులు ఈ ఉపకార వేతనాలకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా సంబంధిత కోర్సులో గత ఏడాది 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
ఒక కోర్సులో అడ్మిషన్ పొందిన తర్వాత కోర్సు మార్చుకుంటే వారు అనర్హులు
ఇచ్చిన సమాచారం తప్పుడు సమాచారం అని నిర్ధారణ అయితే వారి నుంచి లబ్ధి పొందిన మొత్తం సొమ్ములు తిరిగి వసూలు చేయ్యడమే కాకుండా భవిష్యత్‌లో ఏ ఇతర ఉపకార వేతనం పొందేందుకు వీలు లేకుండా వారిని అనర్హుల జాబితాలో ఉంచుతారు.