ఆలయ అధికారులతో మాట్లాడుతున్న వెంకటవీరయ్య
-
ఆలయాల పునర్నిర్మాణానికి రూ. కోటి
-
తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ సేవలు విస్తరిస్తాం
-
టీటీడీ పాలక మండలి సభ్యులు, ఎమ్మెల్యే వెంకటవీరయ్య
భద్రాచలం : తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా భద్రా^è లంలో రూ.4.50 కోట్లతో సామాన్య భక్తుల వసతి కోసమని సత్రాన్ని నిర్మించనున్నట్లు టీటీడీ పాలక మండలి సభ్యులు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం ఆయన రామాలయాన్ని దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం రామాలయ అభివృద్ధికి టీటీడీ ద్వారా నిధులు కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. భద్రాచలంలో సత్రం నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపినందున దేవదాయశాఖ ఇందుకు అవసరమైన స్థలం కేటాయించేలా ఇప్పటికే ఆ శాఖమంత్రి ఇంధ్రకరణ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లటం జరిగిందన్నారు. తానీషా కల్యాణ మండపం వెనుక అర ఎకరం కేటాయించినందున రెండు నెలల్లో ఈ పనులు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయాల పునర్నిర్మాణానికి రూ. కోటి రూపాయాలు కేటాయించినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలతో సంబంధం లేకుండా టీటీడీ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.