గంజాయి రవాణా చేస్తూ పట్టుబడి పరారైన ఇద్దరు నైజీరియన్లు, కారు డ్రైవర్ మురుగన్‌ను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు ఎట్టకేలకు సోమవారం అరెస్ట్ చేశారు.
దొరవారిసత్రం: గంజాయి రవాణా చేస్తూ పట్టుబడి పరారైన ఇద్దరు నైజీరియన్లు, కారు డ్రైవర్ మురుగన్‌ను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు ఎట్టకేలకు సోమవారం అరెస్ట్ చేశారు. వీరిని నాయుడుపేట పోలీసు స్టేషన్‌లో ఉంచి రహస్యంగా విచారణ చేపట్టుతున్నట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం విశాఖపట్టణం నుంచి చెన్నైకు కారులో అక్రమంగా గంజాయి తరలిస్తూ దొరవారిసత్రం పోలీసులకు కారుతో సహా ఇద్దరు నైజీరియన్లు, డ్రైవర్ మురుగన్ పట్టుబడి పరారు కావడం సంచలనం సృష్టించింది.
ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు రెండు రోజులు క్రితమే చెన్నై వెళ్లారు. పోలీసులకు లభించిన నైజీరియన్ల పాస్‌పోర్టు, కారు నంబరు తదితర ఆధారాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.