విజయనగరం : ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను యాజమాన్యం వేధిస్తుందని ఎన్‌ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాసరావు ఆరోపించారు. మంగళవారం విజయనగరం జిల్లా సాలూరులో ఎన్‌ఎంయూ ఏర్పాటు చేసిన సమావేశంలో వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.
కార్మికులు చేసిన చిన్న తప్పులను కూడా యాజమాన్యం పెద్దదిగా చూస్తూ వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. కార్మికులను వేధిస్తే ఉద్యమం తప్పదని ఆయన ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరించారు.