
ఖాళీ మంచాలే గతి
హిందూపురం టౌన్ : పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పడుకోవడానికి ఖాళీ మంచాలే గతి. 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో పురుషులు, స్త్రీల వార్డులో చాలా మంచాలపై పరుపులు, దుప్పట్లు కూడా లేవు. దీంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే రోగులను ఖాళీ మంచాలపైనే పడుకోబెడుతున్నారని, కనీసం దుప్పట్లు కూడా ఇవ్వడం లేదని రోగులు వాపోతున్నారు. అధికారులు, పాలకులు స్పందించి ఖాళీ మంచాలపై పరుపులు, దుప్పట్లు ఏర్పాటు చేయాలని రోగులు, రోగుల బంధువులు కోరుతున్నారు.