నెక్ట్స్‌ ఎగ్జిట్‌ ఎగ్జామ్‌ వద్దే వద్దు | no next exit exams | Sakshi
Sakshi News home page

నెక్ట్స్‌ ఎగ్జిట్‌ ఎగ్జామ్‌ వద్దే వద్దు

Published Wed, Feb 1 2017 10:19 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

నెక్ట్స్‌ ఎగ్జిట్‌ ఎగ్జామ్‌ వద్దే వద్దు

నెక్ట్స్‌ ఎగ్జిట్‌ ఎగ్జామ్‌ వద్దే వద్దు

-వైద్యులకు ఆ పరీక్ష గొడ్డలిపెట్టు
-ఎన్‌ఎంసీ నిర్ణయం దారుణం
-వైద్యవిద్యార్థులు భారీ ర్యాలీ, ధర్నా
కర్నూలు(హాస్పిటల్‌): జాతీయ స్థాయిలో నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌(ఎన్‌ఎంసీ) నిర్వహించాలనుకున్న నెక్ట్స్‌ ఎగ్జిట్‌ ఎగ్జామ్‌ వైద్యులకు గొడ్డలిపెట్టుగా మారుతుందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కర్నూలు శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ శివశంకర్‌రెడ్డి, డాక్టర్‌ సి. మల్లికార్జున్‌ అన్నారు.  ఈ ఎగ్జామ్‌ను వ్యతిరేకిస్తూ బుధవారం కర్నూలు మెడికల్‌ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిలోని క్యాజువాలిటీ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్‌ఎంసీ వద్దు...ఎంసీఐ ముద్దు, ఎన్‌ఎంసీ డౌన్‌ డౌన్, ఎంసీఐ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. వీరికి ఐఎంఏ నాయకులు మద్దతు ప్రకటించారు.
 
ఈ సందర్భంగా డాక్టర్లు కైప శివశంకర్‌రెడ్డి, సి. మల్లికార్జున మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంసీఐని రద్దు చేసి, దాని స్థానంలో ఎన్‌ఎంసీని ఏర్పాటు చేసిందని, ఇందులోని సభ్యులందరూ నామినేటెడ్‌ పదవుల ద్వారా వచ్చిన వారన్నారు. వీరికి వైద్యవృత్తి గురించి పూర్తిగా అవగాహన లేక, పొంతన లేని నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక విద్యార్థికి ఎంబీబీఎస్‌ సీటు రావాలంటే    చాలా కష్టపడాలనా​‍్నరు. సీటు వచ్చిన తర్వాత కూడా ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ నిర్వహించే పలు పరీక్షలను పాసైతే గానీ ఎంబీబీఎస్‌ సర్టిఫికెట్‌ చేతికి అందదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో   ఎన్‌ఎంసీ వారు అనాలోచితంగా ఎగ్జిట్‌ ఎగ్జామ్‌ను ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకున్న వారు రాయాలని, అందులో ఉత్తీర్ణత సాధించిన వారే ప్రాక్టీస్‌కు అర్హులవుతారని చెప్పడం అవివేకమన్నారు.
 
ఒకవైపు ఆయుష్‌ వైద్యులు, ఆర్‌ఎంపీలు అల్లోపతి వైద్యం చేస్తున్నారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమను మరోసారి పరీక్షిస్తామనడం దారుణమన్నారు. వైద్యవిద్యార్థులు చేస్తున్న ఆందోళనకు దేశవ్యాప్తంగా ఐఎంఏ మద్దతు ప్రకటించి పాల్గొందని తెలిపారు. పీజీ వైద్యుల అసోసియేషన్‌ నాయకులు నరేంద్ర, హౌస్‌సర్జన్‌ అసోసియేషన్‌ నాయకులు సందేష్‌ మాట్లాడుతూ ఎగ్జిట్‌ ఎగ్జామ్‌ రాయడానికి ఇకపై వైద్య విద్య తర్వాత  ఇంటర్‌​‍్నషిప్‌ చేయకుండా అందరూ కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.  పీజీ సీట్లను 50 శాతం సర్వీసు అభ్యర్థులకు ఇవ్వాలని నిర్ణయించడం కూడా దారుణమన్నారు. పీజీ సీట్లను పెంచి సర్వీసు అభ్యర్థులకు ఇవ్వాలని డిమాండ్‌  చేశారు.   కార్యక్రమంలో ఐఎంఏ కోశాధికారి డాక్టర్‌ రంగయ్య, పీజీ వైద్య విద్యార్థుల సంఘం నాయకులు అక్షిత్, నరేష్, వినోద్, క్రాంతి, గురుసాయి, రాజేశ్వరి, రూప, హౌస్‌ సర్జన్‌ అసోసియేషన్‌ నాయకులు కిశోర్, మనీష్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement