-
ఈ నెలలోనే ఐదేసి ఆది, సోమ, శనివారాలు
-
ఒకే నెలలో ఆదివారం రోజునే అమావాస్య, పౌర్ణమి కూడా
రాయవరం :
కాలం తనతో పాటు ఎన్నో వింతలు, విశేషాలను కూడా తీసుకు వస్తుంది. కాలం చేసే వింతలు, విశేషాలు చరిత్రలో గుర్తులుగా మిగిలి పోతుంటాయి. అలాగే 2016 అక్టోబరు నెల తనతో పాటు కొన్ని విశేషాలను తనతోపాటు తీసుకుని వస్తుంది. సాధారణంగా ఒక నెలలో నాలుగేసి వారాలు రావడం సహజం. కాని వచ్చే అక్టోబరు నెలలో ఆది, సోమ, శనివారాలు ఐదేసి రావడం విశేషం. 2, 9, 16, 23, 30 తేదీలు ఆదివారాలుగా వస్తే, 3, 10, 17, 24, 31 తేదీలు సోమవారాలుగా, 1, 8, 15, 22, 29 తేదీలు శనివారాలుగా వచ్చాయి.
కాగా ఒకే క్యాలండర్ నెలలో పౌర్ణమి, అమావాస్య రావడం అరుదుగా జరుగుతుంది. ఈ నెలలో 16న ఆదివారం పౌర్ణమి వస్తే, 30న ఆదివారం అమావాస్య రావడం మరొక విశేషంగా చెప్పవచ్చు. అదే నెలలోనే 11న దసరా, 12న మొహర్రం, 30న దీపావళి పర్వదినాలు వచ్చాయి. ఇటువంటి నెల 863 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.