‘ఖాకీ’ వివాదం..! | offending officer booked red handed infront of his family with another woman | Sakshi
Sakshi News home page

‘ఖాకీ’ వివాదం..!

Published Wed, Aug 30 2017 12:13 PM | Last Updated on Sun, Sep 17 2017 6:09 PM

‘ఖాకీ’ వివాదం..!

‘ఖాకీ’ వివాదం..!

చిక్కుల్లో పడిన మహిళా పోలీస్‌ స్టేషన్‌ అధికారి
ఓ యువతితో కుటుంబ సభ్యులకు చిక్కిన వైనం
పోలీస్‌ బాస్‌కు చేరిన వివాదం..
నేడు విచారణ చేపట్టనున్న సీపీ..?


సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : నగరంలోని మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఓ వివాదాస్పద అధికారి మరో సారి చిక్కుల్లో పడ్డాడు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఆయనే అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడినట్లు తెలిసింది. చెడు అలవాట్లకు అలవాటు పడిన ఆయన మంగళవారం రాత్రి ఓ యువతితో కలిసి హసన్‌పర్తి వైపు వెళ్తుండగా సొంత కుటుంబ సభ్యులు చూసినట్లు సమాచారం. ఆయన తీరుపై అనుమానం వచ్చి వారు వాహనాన్ని వెంబడించినట్లు తెలిసింది. దీంతో కంగారుపడిన సదరు అధికారి కారును అందులో ఉన్న యువతిని అక్కడే వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది.

కుటుంబ సభ్యులు ఆ యువతిని విచారించగా సదరు అధికారి లీలలు బట్టబయలు అయ్యాయని తెలిసింది. అయితే రాత్రి రోడ్డుపై చోటు చేసుకున్న ఈ వివాదం స్థానికంగా చర్చనీయాంశగా మారింది. చివరకు ఈ అంశం పోలీస్‌ కమిషనర్‌ దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. దీనిపై నేడు సీపీ విచారించనున్నట్లు సమాచారం. మహిళలకు రక్షణ కల్పించాల్సిన అధికారే ఇలా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈయన పలు వివాదాల్లో పేరున్నట్లు పలువురు చర్చించుకోవడం కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement