కొల్లేరు హామీలు అమలు చేస్తాం | on 29th pedditlamma bridge foundation | Sakshi
Sakshi News home page

కొల్లేరు హామీలు అమలు చేస్తాం

Published Sun, Aug 21 2016 11:09 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

కొల్లేరు హామీలు అమలు చేస్తాం

కొల్లేరు హామీలు అమలు చేస్తాం

మంత్రి కామినేని 
29న పెద్దింట్లమ్మ వారధికి శంకుస్థాపన
సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు రాక
కైకలూరు : 
ఎన్నికల సమయంలో కొల్లేరు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ప్రకటించిన హామీలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ చెప్పారు. స్థానిక ట్రావెలర్స్‌ బంగ్లాలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు పెద్దలతో ఆదివారం సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద వారధి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), మంత్రులు హాజరవుతారని తెలిపారు. గతంలో వారధి నిర్మాణానికి రూ.13 కోట్లు కేటాయించారని, ఇప్పుడు పెరిగిన ఖర్చులను పరిగణలోకి తీసుకుని నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో Mýృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు సంఘ అధ్యక్షులు సైదు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బలే ఏసురాజులు పాల్గొన్నారు. 
భూముల పంపిణీపై..
కొల్లేరు ఆపరేషన్‌ సమయంలో కృష్ణాజిల్లాలో అదనంగా ధ్వంసం చేసిన భూముల పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని మంత్రి కామినేని శ్రీనివాస్‌ చెప్పారు. ఇక కొల్లేరు కాంటూరు కుదింపు అంశం కేంద్ర స్థాయిలో ఉందన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement