రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
కొత్తవవలస : కొత్తవలస–విశాఖపట్టణం రహదారిలో స్థానిక గూడ్స్ షెడ్ సమీపంలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు దుర్మరణం చెందారు. మతుడ్ని దేశపాత్రునిపాలెం గ్రామానికి చెందిన పల్లెపు సుబ్రహ్మణ్యం(38)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో తలకు తీవ్రగాయం కావడంతో సంఘటనా స్థలంలోనే మతి చెందాడు. మతునికి భార్య సింహాద్రమ్మ, కుమార్తె మహలక్ష్మి (15) గణేష్‌కుమార్(13) ఉన్నారు. మతుడికి కొంతకాలంగా మతిస్థిమితం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి. అప్పలనాయుడు తెలిపారు.